Vijayawada: బెజవాడ వాసులకు ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది.. వాంతులు విరేచనాలతో ఒకేసారి 18 మంది, కొత్త రాజరాజేశ్వరి పేట నుంచీ వచ్చి కొత్త ప్రభుత్వాసుపత్రిలో చేరడంతో విషయం బయటకి వచ్చింది.. దీంతో, మొత్తం అధికార యంత్రాంగం అలర్ట్ అయింది.. కొత్త రాజరాజేశ్వరి పేటలోని ఒక మున్సిపల్ స్కూలులో 7 బెడ్లు కలిగిన మూడు వార్డులు సిద్ధం చేసారు.. స్థానికంగా వచ్చిన డయేరియా కేసులకు వెంటనే ప్రాథమికంగా చికిత్స అందిస్తున్నారు.. వరుసగా కేసులు పెరుగుతుండటంతో కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో 34 బెడ్లతో ఒక వార్డును సిద్ధం చేసారు.. అలాగే 24 బెడ్లతో మరొక వార్డును సిద్ధం చేసారు.. దాదాపు 70కి పైగా కేసులు నమోదు కావడంతో మొత్తం మునిసిపల్, వైద్య ఆరోగ్య శాఖల క్షేత్రస్ధాయి ఉద్యోగులంతా కొత్త రాజరాజేశ్వరి పేటలోనే ఉన్నారు.. ఇంటింటికి సర్వేలు చేయడం మొదలుపెట్టారు.. నీటి శాంపిల్స్ తీసుకుని టెస్టులకు పంపిస్తున్నారు.. మునిసిపల్ శాఖామంత్రి నారాయణ, స్ధానిక ఎమ్మెల్యే బొండా ఉమాతో కలిసి హెల్త్ క్యాంపును పరిశీలించారు… అధికారులతో అక్కడి పరిస్ధితులను అడిగి తెలుసుకున్నారు.. ఆ ప్రాంతంలో గణేష్ నిమజ్జనం తరువాత పెట్టిన భోజనాలు తిన్నవారు అనారోగ్యానికి గురయ్యారని అనుమానాలు వ్యక్తం చేసారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: ఇదే మనకు మంచి అవకాశం.. ఏ మాత్రం జాప్యం తగదు..
డయేరియా రావడానికి సాధారణంగా కలుషిత నీరు కారణం అవుతుంది… అయితే ప్రాథమిక టెస్టులలో ఆ ప్రాంతంలోని నీరు కలుషితం కాదని, త్రాగవచ్చని తేలిందని స్థానిక ఎంఎల్ఏ సైతం అన్నారు… ఇంకా డీటైల్డ్ రిపోర్టు కోసం ల్యాబ్ కు శాంపిల్స్ పంపించామని అధికారులు, ఎంఎల్ఏ అన్నారు.. ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన బాధితులను సైతం ఎంఎల్ఏ, మంత్రి పరామర్శించారు.. నీటిని పరీక్షలు నిర్వహించడానికి ఒక ప్రత్యేక వాహనాన్ని తీసుకొచ్చారు ఫుడ్ కంట్రోల్ అధికారులు.. పూర్తిస్థాయిలో టెస్టులు నిర్వహిస్తారు.. బ్యాసిలస్ టెస్టుల కోసం గుంటూరు ల్యాబ్ కు పంపిస్తారు… గంట గంటకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో, అధికారులు 24 గంటలు వైద్య సేవలు అందించేలా ఏర్పాటు చేసారు… డయేరియా కేసులు ఇంకా పెరిగి మరో పాండమిక్ గా మారకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా చూడాలి మరి.. మరోవైపు, సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు ప్రజలు.. ఏ ఆస్పత్రి చూసినా.. రోగులతో కిటకిటలాడుతున్నాయి..