GVL Narasimha Rao: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అంతా ఎన్నికల పొత్తుల గురించే చర్చ సాగుతోంది.. వైసీపీ సింగిల్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధం కాగా.. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన.. అనూహ్యంగా.. టీడీపీతో జత కట్టింది.. అయితే, బీజేపీ స్టాండ్ పై మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్‌పార్టీలు.. అంటే ఇండియా కూటమి కలిసే పోటీ చేస్తే ఎలా ఉంటుందనే చర్చలు కూడా సాగుతున్నాయి.. ఇక, బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. పొత్తుల అంశం బీజేపీ జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్న ఆయన.. ఎన్నికల సందర్భంలో పొత్తులపై నిర్ణయం ఉంటుందన్నారు.. అధికార పార్టీ నేతలు మాపై ఆరోపణలు చేయడం సబబు కాదని హితవుపలికారు. ఏదేమైనా బీజేపీ నిర్ణయం లేటైనా లేటెస్ట్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు జీవీఎల్.
Read Also: Kodali Nani: చంద్రబాబు-పీకే భేటీపై కొడాలి ఆసక్తికర వ్యాఖ్యలు.. అసలు విషయం ఇదే..!
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో చర్చగా మారిన టీడీపీ అధినేత చంద్రబాబు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీపై స్పందించిన జీవీఎల్.. చంద్రబాబు- పీకేని ఎందుకు కలిశారో ఆయన చెప్పాలన్నారు. ఎవరిని ఎవరైనా కలిసే అవకాశం ఉన్నప్పుడు సమావేశం వెనుక కారణాలను సీబీఎన్, పీకే చెబితేనే బాగుంటుంది అన్నారు. అది వారి వ్యక్తిగతం అని కొట్టిపారేశారు. ఇక, స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంట్ లో నేనే మాట్లాడుతున్నాను.. బయట చాలా అపోహలు ఉన్నాయి.. వాటిని నమ్మల్సిన అవసరం లేదన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణలో భాగంగానే జిందాల్ తో ఒప్పందం కుదుర్చుకున్నామనేది అవాస్తవం అన్నారు జీవీఎల్. ప్లాంట్ ని సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు. అందుకు అనుగుణంగానే ఒప్పందాలు జరుగుతున్నాయి.. ఇప్పుడు జరుగుతున్న ఒప్పందాలకు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సంబంధం లేదని స్పష్టం చేశారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.