Tahsildar Sensational Comments: వైరల్‌గా మారిన మడకశిర తహసీల్దార్ వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tahsildar Sensational Comments: మంత్రులు, ఉన్నతాధికారులో తమ ప్రాంతంలో పర్యటిస్తే.. కిందిస్థాయిలో అధికారులు ఆ ఖర్చులు భరించడం.. వాటిని లెక్కల్లో చూపించడం చేస్తుంటారు.. అయితే, అసలు డబ్బులే లేకపోతే ఏం చేయాలి? అనేది పెద్ద ప్రశ్న.. కొన్ని సందర్భాల్లో కిందిస్థాయిలో అధికారులు ఎలా నలిగిపోతున్నారట.. ఓ ఎమ్మార్వో చెబుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. పైసా లేనిదే పనిచేయను అంటూ తెగేసి చెబుతోన్న ఆ తహశీల్దార్.. బహిరంగంగానే లంచం డిమాండ్ చేయడం కొసమెరుపు.. అసలు ఇంత ఖర్చులు తాము ఎలా భరించాలని నిలదీస్తున్నాడు.. అయితే, మంత్రుల పర్యటన ముసుగులో లక్షలు వసూళ్లు చేస్తున్నారని మండిపడుతున్నారు.. మడకశిర తహశీల్దార్ కార్యాలయంలో కంచాల నిండా లంచాలు అనే విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నరాయి..
Read Also: Rakul Preet Singh: శారీ లో నడుము అందాలతో అట్ట్రాక్ట్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఇక, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ప్రకారం.. శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర తహసీల్దార్ ముర్షావలి కలిశాడు మెలవాయి పంచాయతీకి చెందిన ఓ రైతు.. తన సొంత పొలం సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. మీ కింది స్థాయి అధికారులు డబ్బులు లేనిదే పని చేయడం లేదని ఆవేదన వెల్లబోసుకున్నాడు ఆ రైతు.. ఇక, ఆ రైతు మాటలకు స్పందించిన తహసీల్దార్.. వెటకారంగా మాట్లాడుతూ.. సీఎం లాంటివారే డబ్బులు తీసుకుని ఫ్రాడ్ చేస్తున్నారు.. మేమెంత? అని ప్రశ్నించాడు.. మాపై అధికారులు మాకు డబ్బులు ఇవ్వరు.. అందుకు మీలాంటి రైతుల దగ్గర తీసుకొని పై అధికారులు వచ్చినప్పుడు ఖర్చు చేస్తుంటాం అని చెప్పుకొచ్చాడు.. ఈ నెల 13వ తేదీన టెక్స్టైల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీత వచ్చినప్పుడు వారి భోజనం కోసం అయినా ఖర్చు లక్షా 70 వేల రూపాయలు అయ్యిందన్నారు.. అంతేకాదు, ఆయనకు వాళ్లు పెట్టిన మెనూ కూడా చూపిస్తూ.. మడకశిరలో దొరకకపోతే మరో ప్రాంతం నుంచి తెప్పించాల్సి వచ్చిందంటూ రుబాబు చూపించారు. ఆ ఖర్చుకు నా జీతం డబ్బులు ఇవ్వాలా? అని ప్రశ్నించాడు.. రైతులతో డబ్బులు తీసుకొని పని చేసి పెడుతుంటాం.. పై స్థాయి అధికారులు వచ్చినప్పుడు వాటికి ఖర్చు పెడతాం.. అంతేకానీ, నేను, కింద వీఆర్వోలు ఖర్చు చేయాలంటే ఎలా అవుతుంది అంటూ ఆ రైతుకు సమాధానం చెప్పాడు.. ఎవడికి మా బాధ అర్థం కాదు.. మేం చెప్తేనే బయటకు తెలుస్తుంది.. ఏమన్నా అంటే లంచం తీసుకుంటున్నారు అంటారంటూ.. తాను చేసే పనిని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు మడకశిర తహసీల్దార్ ముర్షావలి.. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాకు ఎక్కి చక్కర్లు కొడుతుండడంతో.. అతడిని పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!