ప్రజల తరఫున పోరాడితే, నాయకులను జైల్లో పెడుతున్నారు.. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు పరోక్షంగా స్పందిస్తూ.. ఏపీలో జగన్ ప్రభుత్వం అహంకారంతో ఉంది.. అహంకారం ఉంటే ఏమవుతుంది అనేది తెలంగాణలో చూశాం.. మరో మూడు నెలల్లో ఇక్కడా చూస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
తిరుపతి జిల్లాలోని బాలిరేడ్డిపాలెంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీచౌంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పారు.
విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో ప్రజల సామాజిక అభివృద్ధికి తోడ్పడేలా అసమానతలు లేని అభివృద్ధి కోసం ప్రజాప్రణాళికపై సమాలోచన కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామిక అభివృద్ధి జరగాలి అని కోరారు.
పొలిటికల్ కాంట్రాక్ట్ కోసం పుట్టిన పార్టీ జనసేన అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. తెలంగాణ ఫలితాల తర్వాత జనసేనకు తగిలిన దెబ్బకు మతి చలించినట్టు కనిపిస్తోందీ.. స్థాయిని మరిచి అబ్రహం లింకన్ గురించి కాదు చంద్రబాబుతో ఉన్న లింకులు గురించి పవన్ మాట్లాడితే మంచిది.. ఓట్లను సాధించడంతో బర్రెలక్కతో జనసేన పోటీపడింది
నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించబోతున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పనున్నారు. నందివెలుగు, కూచిపూడి లాకులు, అమృతలూరు, ఉత్తర పాలెం మీదుగా కర్లపాలెం మండలం పాత నందాయపాలెం చంద్రబాబు చేరుకోనున్నారు.
ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో సీఐడీ అధికారులు పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ పైన నేడు ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది. గతంలో విచారణ సమయంలో ఇరు పక్షాలు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు గురించి ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.