కేకే లైన్ డబుల్ లైన్గా మార్చబోతున్నాం.. దీంతో మరిన్ని రైళ్లు వచ్చే అవకాశం ఉంటుందన్నారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. ఏపీ పర్యటనలో ఉన్న ఆయన.. విజయనగరంలో మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్ళ లో ప్రధాని నరేంద్ర మోడీ అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని.. సంక్షేమ కార్యక్రామాలు అర్హత కలిగిన ప్రతీ కుటుంబానికి అందిస్తున్నామని తెలిపారు.
విజయవాడ శివారులో తాగు నీటి సమస్య ఉంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలో ప్రతి గ్రామానికి నీటి ట్యాంకర్ల పంపిణీ చేశామని.. ఇప్పటిదాకా 120 న్యూటి ట్యాంకర్ల ఇచ్చాం.. ఇంకా నీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు ఇస్తాం.. 13 కోట్లు తాగు నీటి సమస్య పరిష్కారానికి ఖర్చు చేస్తున్నాం.. ఏ ఎంపీ చేయనటువంటి కార్యక్రమం చేయడం.. నా అదృష్టంగా భావిస్తున్నాను.. చంద్రబాబు, ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకెళ్తున్నామని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని
విజయనగరం జిల్లా కంటకాపల్లి దగ్గర జరిగిన రైల్వే ప్రమాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్.. మానవ తప్పిదం వల్లే కంటకాపల్లిలో ఘోర రైలు ప్రమాదం జరిగిందన్నారు.. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు. ఇక, త్వరలో మరికొన్ని వందే భారత్ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయని తెలిపారు.
గుండ్లకమ్మ ప్రాజెక్ట్ నిర్వహణ తీరు సక్రమంగా లేదని మండిపడ్డారు అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్.. రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టుల భద్రతపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్న ఆయన.. ప్రాజెక్టుల భద్రత ఆందోళన కలిగిస్తుందన్నారు. గత ఏడాదిలో గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేటు, అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకోపోయినా వాటిని ఇంతవరకు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడం శోచనీయం అన్నారు.
నేడు, రేపు అమలాపురంలో సామాజిక వర్గాల వారీగా భారీ ఎత్తున కార్తీక వన భోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. నేడు కాపుల వన భోజన కార్యక్రమం ఉండగా.. రేపు శెట్టిబలిజ సామాజిక వర్గ వన భోజనాలు ఉన్నాయి.. అయితే, జిల్లాలో పోలీసులు ఆంక్షలు విధించారు..