CM YS Jagan Kadapa Tour: రెండో రోజు తన సొంత జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పర్యటన కొనసాగనుంది.. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఇడుపులపాయ గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకోనున్న ఆయన.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు.. ఆ తర్వాత ఇడుపులపాయ ప్రేయర్ హాల్‌లో జరిగే ప్రార్ధనల్లో పాల్గొంటారు.. సుమారు మూడు గంటల పాటు సీఎం ప్రార్థనలో పాల్గొనబోతున్నారు.. ఇక, మధ్యాహ్నం 12.30 గంటలకు పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం చేరుకుంటారు సీఎం జగన్.. మండల, ఎమ్మార్వో ఆఫీసు, పోలీసు స్టేషన్, రోడ్డు వైడనింగ్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు చేస్తారు.. సాయంత్రం 3 గంటలకు తిరిగి ఇడుపులపాయ చేరుకుంటారు.. ఇడుపులపాయలోని ఎకో పార్క్‌లో పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశం కాబోతున్నారు ఏపీ సీఎం.. గంటన్నర పాటు ఈ భేటీ జరగనుండా.. ఆ తర్వాత్రి ఈ రోజు రాత్రికి ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌లో బస చేయనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
సీఎం వైఎస్ జగన్ వరుసగా మూడు రోజులో జిల్లాలో పర్యటిస్తున్నారు.. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అలాగే, క్రిస్మస్ వేడుకల్లోనూ పాల్గొంటారు. 25వ తేదీన అనగా రేపు ఉదయం ఇడుపులపాయ గెస్ట్‌హౌస్ నుంచి బయల్దేరి పులివెందుల చేరుకుంటారు, అక్కడ సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు.. ఆ తర్వాత మధ్యాహ్నం తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్.