వైసీపీ నాలుగవ జాబితాపై వైసీపీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేసింది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాయలంతో సీఎం జగన్ తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ ఈ జాబితాపై ప్రధానంగా చర్చించారు.
నా వెంట్రుక ముక్క కూడా చంద్రబాబు పీకలేరు అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు ఉడత ఊపులకు భయపడను.. చంద్రబాబు ఎంతటి మోసగాడో అందరికీ చెబుతూనే ఉంటాను.. గెలుపు కోసం పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకుంటున్నారు.. బూట్లు నాకుతున్నారు.. శత్రువుకు కూడా లోకేష్ లాంటి కొడుకు పుట్టకూడదు.
రేపు విజయవాడ బందర్ రోడ్డులో సామాజిక న్యాయ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ప్రారంభోత్సవ సభ ఉండటంతో పాటు అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా వాహనాల ట్రాఫిక్ మళ్లింపు కొనసాగుతుందని విజయవాడ ట్రాఫిక్ డీసీపీ కే. చక్రవర్తి తెలిపారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుపై రాష్ట్ర ప్రభుత్వ ఆదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ రాజ్యసభ సభ్యులు కనక మేడల రవీంద్ర కుమార్ నాకు ఒక సవాల్ విసిరారు.. దాన్ని నేను స్వీకరిస్తున్నాను అని చెప్పారు.
రేపు మధ్యాహ్నం మూడు గంటలకు సమతా సభ ఏర్పాటు చేస్తున్నామని వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. సాయంత్రంఆరు గంటలకు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందన్నారు.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరుగుతుంది అని ఆయన చెప్పారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ అభ్యర్ధుల ఎంపిక మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. దీంతో నాలుగవ జాబితాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే నాలుగవ జాబితా కోసం వైసీపీ అధినాయకత్వం తుది కసరత్తు ప్రారంభించింది.
ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీలకు విశాఖపట్నం ఆథిత్యం ఇవ్వనుంది. అడిషనల్ డీజీపీ రాజీవ్ కుమార్ మీనా తెలిపారు. 14వ అల్ ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్-2024 ఈ సారి విశాఖలో జరగనున్నాయని పేర్కొన్నారు.