ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కొనసాగుతోన్న మంత్రి మండలి సమావేశంలో పలు కీలక అంశాలకు పచ్చజెండా ఊపారు.. కేబినెట్లో డీఎస్సీ నిర్వహణ, నోటిఫికేషన్ జారీపై చర్చించారు.. సుమారు 6 వేల టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఆమోద ముద్ర వేసింది ఏపీ కేబినెట్..
విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది.. ఇప్పుడు మరో కీలక ముందడుగు వేసింది.. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ఐబీ సిలబస్ తీసుకురానున్నారు.. రాష్ట్ర ప్రభుత్వ SCERTతో అంతర్జాతీయ విద్యా బోర్డు IB భాగస్వామ్యం కాబోతోంది.. దీనికి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఒప్పందం జరగనుంది.. ఈ రోజు ఉదయం 10 గంటలకు అంతర్జాతీయ విద్యా బోర్డుతో రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీఈఆర్టీ (SCERT) ఒప్పందం చేసుకోబోతోంది..
ముఖ్యమంత్రి వైయస్.జగన్ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు(ఎస్ఐపీబీ) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోకి విస్తారంగా పెట్టుబడులు– పలు ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా.. ఇంధన రంగంలో రూ.22,302 కోట్ల పెట్టుబడులు – ప్రత్యక్షంగా 5,300 మందికి ఉద్యోగాలకు ఆమోదం తెలిపింది.