Manickam Tagore: 2014లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయాలు.. కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహార ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్.. మూడో జోనల్ రివ్యూ మీటింగ్ విశాఖలో జరిగింది.. ఏపీలో అక్రమ ఇసుక మైనింగ్ జరుగుతోందని కేంద్రానికి హైకోర్టు ద్వారా తెలిసినా చర్యలు లేవన్నారు.. నరేంద్ర మోడీ ప్రభుత్వం అక్రమ ఇసుక మైనింగ్ పై స్పందించేందుకు సిద్ధంగా లేదని అర్ధమవుతోందని విమర్శించిన ఆయన.. ఇక, చంద్రబాబు స్పెషల్ కేటగరీ స్టేటస్ గురించి అడగకుండా NDAలోకి వెళతారా? అని ప్రశ్నించారు.
Read Also: True Lover : ఓటీటీ లోకి రాబోతున్న ఎమోషనల్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
మరోవైపు, ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీంకోర్టు ఆర్డర్ పూర్తిగా చదివిన తరువాత స్పందిస్తాం అన్నారు మాణిక్కం ఠాకూర్.. ఏపీలో నాలుగు ర్యాలీలు నిర్వహిస్తాం.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మొదటి ర్యాలీలో పాల్గొంటారు.. కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు కూడా వచ్చి ర్యాలీల్లో పాల్గొంటారని తెలిపారు. 2014లో కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయాలు కాంగ్రెస్ ను బలహీన పరిచాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అన్ని విధాలా పనిచేస్తున్నాం అన్నారు. ఎమ్మెల్యే ఆర్కే ఏం చేస్తారనేది ఆయనే చెప్పాలన్నారు. ఇక, ఎలక్టోరల్ బాండ్లు అంశంపై కేంద్ర పార్టీతో మాట్లాడి స్పందిస్తాం అన్నారు. ప్రతిపక్షాలను పోటీకి రాకుండా చేయడానికి మోడీ ప్రభుత్వం తెచ్చినవి ఎలక్టోరల్ బాండ్లు అని దుయ్యబట్టారు. మాకు వెయ్యికి పైగా అప్లికేషన్లు వచ్చాయని ఈ సందర్భంగా ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు కాంగ్రెస్ ఎంపీ.. ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహార ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్.