ముద్రగడ హాట్ కామెంట్స్.. సినిమాలు, రాజకీయలు ఏవీ వదలకుండా..!
సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.. ఈ రోజు విపక్షాలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.. పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధమని ప్రకటించిన ఆయన.. జనసేన వేరే పార్టీలో కలవడం కాదు త్వరలోనే క్లోజ్ అయిపోతుందని జోస్యం చెప్పారు.. పిఠాపురంలో వైసీపీకి సునాయాసంగా ఉంటుందన్న ఆయన.. సినిమావాళ్లు అతీతులు కాదు.. మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు.. మా ఇంటికొస్తే ఏం తెస్తారు అనే విధంగా సినిమా వాళ్ల వ్యవహారం ఉంటుందని దుయ్యబట్టారు.. ఇక, 175 సీట్లలో పోటీ చేస్తానంటే బీజేపీ లో చేరతా అని చెప్పాను.. మీరు పోటీ చేసే 5-6 సీట్లలో నన్ను లాగొద్దు అని చెప్పాను.. జనసేన 70-80 సీట్లలో పోటీ చేయకుండా.. 20 సీట్లు కోసం నేను ఎందుకు? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌ను మొత్తం సీట్లు త్యాగం చేయమనండి.. ఇంకా బాగుంటుంది అంటూ సెటైర్లు వేశారు. ఎన్టీఆర్ తర్వాత సినిమా నటులను ప్రజలు నమ్మలేదు అన్నారు ముద్రడగ.. నిన్న సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరాను.. కొన్ని శక్తులు నన్ను ఇంతకాలం సీఎం జగన్‌కి దూరం చేశారు… కానీ, వైసీపీ పార్టీ ఫౌండర్స్ లో నేను ఒక్కడిని అన్నారు. జగన్ ను సీఎం చేయడానికి నా ప్రయత్నం చేస్తాను అన్నారు. ఇక, మా కుటుంబం 1951 సినిమాలలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఉన్న నటులు ఎవరూ పుట్టలేదన్నారు.. మేం రాజకీయాల్లోకి వచ్చేటప్పటికీ ఇప్పుడు ఉన్న వారికి ఏబీసీబీలు కూడా రావు అంటూ సెటైర్లు వేశారు. వారు సినిమాల్లో హీరో కావొచ్చు.. నేను రాజకీయాల్లో హీరో అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో మొలతాడు లేని వాడు.. లాగు లేని వాడు.. కూఏడా నాకు పాఠాలు చెప్తున్నారని ఫైర్ అయ్యారు. మీది ఏంటి పొడుగు… ఎందుకు మీ దగ్గరకి రావాలి అని నిలదీశారు.
వైసీపీ ఫైనల్ లిస్ట్.. సజ్జల కీలక వ్యాఖ్యలు
ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండగా.. అంతకు ముందే.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, లోక్‌సభ 25 స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల్ని ప్రకటించేందుకు సిద్ధమైంది.. మార్పుచేర్పుల్లో భాగంగా ఇప్పటికే చాలా చోట్ల అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మార్చారు. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల గెలుపోటములపై సర్వేల ఆధారంగా ఇప్పటికే 70కి పైగా అసెంబ్లీ, 20కి పైగా లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేశారు. ఇక, ఈ రోజు ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి దగ్గర నివాళులర్పించి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మరోవైపు ఇడుపులపాయ చేరుకున్న వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు. మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాం.. ఇప్పుడు తుది జాబితాలోనూ అది కనిపిస్తుందన్నారు సజ్జల.. అభ్యర్థుల విషయంలో ఇప్పటికే స్పష్టత ఇచ్చాం.. పెద్దగా మార్పు ఉండవని స్పష్టం చేశారు.. ఐదేళ్లలో అభివృద్ధి.. సంక్షేమం విషయంలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాజీ పడలేదని స్పష్టం చేశారు.. ప్రస్తుతం ఉన్న విధానంలో వైసీపీ CAAను వ్యతిరేకిస్తుందన్నారు.. ఇక, 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ సీట్లను గెలిచే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. కాగా, మధ్యాహ్నం 12.40 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించనున్న సీఎం వైఎస్ జగన్.. మధ్యాహ్నం 12.58 గంటల నిమిషాల నుంచి ఒంటి గంటా 20 నిమిషాల వరకు వైసీపీ ముఖ్య నేతల సమక్షంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నారు.
పొత్తుతో సీటు కోల్పోయిన వాళ్ల ఆందోళన సరికాదు.. పదవులు లేకపోతే బతకలేమా..?
టీడీపీలో టిక్కెట్ దక్కని వాళ్లు చేస్తున్న ఆందోళనపై బుద్దా వెంకన్న మండిపడ్డారు.. చంద్రబాబుకు, పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా కామెంట్లు చేస్తే ఊరుకోనని ముందే చెప్పిన ఆయన.. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. పొత్తు వల్ల సీటు కోల్పోయిన వాళ్ల ఆందోళన సరికాదని హితవుపలికారు.. పదవులు లేకపోతే బతకలేమా? అని ప్రశ్నించారు. ఇండిపెండెంటుగా పోటీ చేస్తా అంటూ బెదిరింపులు సరికాదన్న ఆయన.. కార్యకర్తలు.. పార్టీ కోసం, చంద్రబాబు కోసం పని చేస్తారు.. నేతల కోసం కార్యకర్తలు పని చేయరని స్పష్టం చేశారు.ఇక, రాష్ట్రంలో నాకన్నా ఫైటర్ ఎవరున్నారు..? అని ప్రశ్నించారు బుద్ధా వెంకన్న.. ఐవీఆర్ఎస్ పెడితే ఫస్ట్ ప్లేస్ నాకే వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఎంపీ కేశినేని నాని వాపును చూసి బలుపు అనుకున్నాడు. నాని వెనుక పది మంది కూడా లేరన్నారు.. క్యాష్ కోసం క్యారెక్టర్ అమ్ముకున్న వ్యక్తి కేశినేని నాని అంటూ విమర్శించారు. బెజవాడ ఎంపీ స్థానాన్ని లక్ష ఓట్లతో టీడీపీ గెలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. టిక్కెట్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూళ్లు చేసిన చరిత్ర కేశినేని నానిది అంటూ ఆరోపించారు.. ఇక, కేశినేని నాని ఓటమి ఖాయం.. నానికి భవిష్యత్తు శూన్యం అంటూ జోస్యం చెప్పారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న..
చంద్రబాబు నిర్ణయమే నా నిర్ణయం.. పార్టీ మారే ప్రసక్తే లేదు..
నాకు టికెట్ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయమే నా నిర్ణయం అని స్పష్టం చేశారు శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు.. పార్టీ కోసం కలిసి ఎన్నికల్లో పనిచేస్తాను అన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా వారి మాటలు నమ్మొద్దు.. టీడీపీ కోసం ఎన్నో పదవులను పోగొట్టుకున్నాను.. కానీ, పార్టీ మారే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. ఇది ఒక బాధ్యత అందరూ కలిసి పనిచేసే పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని పిలుపునిచ్చారు. గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం పని చేశాను.. నాకు ఎటువంటి పదవి ఇస్తారో అనేది తెలపాలని కోరారు.. మంచి మెజారిటీతో పార్టీని గెలిపించాల అన్నదే మా లక్ష్యంగా పేర్కొన్నారు. ఇక, సుదీర్ కు నాకు మద్య వేరే ఆలోచన అపార్థాలు అరమరికలు లేవు అని స్పష్టం చేశారు ఎస్సీవీ నాయుడు.. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాలో శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పేరును ఖరారు చేసిన విషయం విదితమే. మరోవైపు.. తమకు టికెట్ రాలేదని కొందరు.. ఈ సారి టికెట్ ఇచ్చే అవకాశం లేదనే సమాచారం అందడంతో మరికొందరు నేతలు.. తమ అనరుచరులతో ఆందోళన నిర్వహిస్తున్నారు.. ఇప్పటికైనా తమకే ఈ సీటును కేటాయించాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
కోర్టు పరిధిలో ఉండగానే కవితకు మళ్లీ సమన్లు..!
ఎమ్మెల్సీ కవిత కేసులో కోర్టులో ప్రోసిడింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈడీకి కవిత పూర్తిగా సహకరించారని ఆమె తరపు న్యాయవాది వెల్లడించారు. అయినా అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. కోర్టు పరిధిలో ఉండగా మళ్లీ సమ్మన్లు జారీ చేశారు. ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని కవిత వేసిన పిటిషన్ ఇంకా సుప్రీం కోర్టు లో పెండింగ్ లో ఉంది. కవిత కి వచ్చిన రిలీఫ్ ఇంకా అమలులో ఉందన్నారు. సుప్రీం కోరు ఫర్ధర్ అంటిల్ ఆర్డర్ ఇచ్చారా అని కవిత అడ్వకేట్ విక్రమ్ చౌదరిని జడ్జి ప్రశ్నించారు. కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని గతంలో సుప్రీం కోర్టు లో వేసిన పిటిషన్ లో స్పెషల్ గా మెన్షన్ చేశామని కవిత అడ్వకేట్ విక్రమ్ చౌదరి తెలిపారు. గతంలో నళిని చిదంబరం కి ఇచ్చిన రిలీఫ్ ఇవ్వాలని కొరామన్నారు. నళిని చిదంబరంకి ఇచ్చిన రిలీఫ్ కూడా కవితకి ఇవ్వాలని కోరామని తెలిపారు. మార్చి 15న 2024 (శుక్రవారం) నిన్న కూడా రిలీఫ్ కి సంభందించిన వాదనలు జరిగాయని, లైవ్ లో ఉన్న వాదనలు దేశమంతా చదివిందని తెలిపారు. ఇదే కేసును 19న విచారిస్తాము అని జడ్జి చెప్పారని తెలిపారు. ఈ సారి సమన్లు ఇస్తే 10 రోజులు నోటీసు ఇస్తాం అన్నారు. మధ్నాహ్నం 12.30 కి నిన్న కోర్టులో విచారణ ముగిసిందని, 30 నిమిషాల్లో కవిత ఇంటికి చేరుకున్నారని విక్రమ్ చౌదరి తెలిపారు. కాగా.. తనపై తప్పుడు కేసు పెట్టారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈడీ తనను అక్రమంగా అరెస్టు చేసిందని అన్నారు. అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు కవిత. భారీ భద్రత నడుమ ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆమె కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడారు.
పీపుల్స్ మార్చ్ కు ఏడాది పూర్తి.. నేడు ఆదిలాబాద్ కు భట్టి విక్రమార్క..!
నేడు ఆదిలాబాద్ జిల్లాకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. బజార్ హత్నూర్ మండలం పీప్రికి వెళ్లనున్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రను పిప్పీరి నుంచి భట్టి ప్రారంభించిన విషయం తెలిసిందే.. ఈరోజుతో పాదయాత్ర ప్రారంభంకు ఏడాది పూర్తీ చేసుకుంది. ఏడాది పూర్తి అయిన సంధర్భంగా పీప్రికి బట్టి వెళ్లనున్నారు. ఉదయం హెలిప్యాడ్ ద్వారా అక్కడకు చేరుకుని..పలు కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం పాల్గొననున్నారు. చారిత్రాత్మక పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు నేడు ఏడాది పూర్తి చేసుకుందని భట్టి విక్రమార్క ఆనందం వ్యక్తం చేశారు. పాదయాత్రలో చూసిన కష్టాల నుండి ఉద్భవించిన హామీలే నేడు తెలంగాణ ప్రజల ప్రభుత్వంలో ప్రజా పాలన సుపరిపాలనకు తొలి అడుగులు వేస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం, బజారహత్నూర్ మండలం, పిప్పిరి గ్రామం నుంచి మార్చి 16- 2023న హాత్ సే హాత్ జోడో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రారంభమైంది. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 1364 కిలోమీటర్లు, 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాలు, 700 గ్రామాలకు పైగా 109 రోజుల పాటు అలుపెరగని పాదయాత్ర చేసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో నమ్మకం, విశ్వాసం, భరోసా కల్పించింది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయం లిఖించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నేటితో ఏడాది పూర్తి సుకుంది. ఈ పాదయాత్రలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు భట్టి. మనిషి సంకల్పానికి ఏది అడ్డుపడది అని భవిష్యత్ తరాలకు చెప్పడానికి ఉదాహారణే పట్టు వదలని పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అన్నారు. మండుటెండల్లో 1364 కిలోమీటర్లు అలుపెరగని పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ పాలన నుండి విముక్తి కలిగించి స్వేచ్ఛాయుత ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నేటికి ఏడాది పూర్తి చేసుకుందని హర్షం వ్యక్తం చేశారు.
జమ్మూ కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంలో ఈసీ విఫలమైంది..
జమ్మూ కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైంది అని మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు. అయితే, ఓటింగ్‌ను పూర్తిగా పునరుద్ధరించడంలో దేశ ఎన్నికల సంఘం పాత్ర పోషించాల్సి ఉందని మాజీ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నుంచి మాకు ఎటువంటి అంచనాలు లేవు.. అయితే, జమ్మూ కాశ్మీర్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియను పూర్తిగా పునరుద్ధరించడంలో అది పాత్ర పోషించాలి.. జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఇప్పటికి 10 ఏళ్లు పూర్తయ్యాయి.. రాష్ట్రంలో లోక్‌సభతో పాటు శాసనసభకు కూడా ఎన్నికలు నిర్వహించాలని ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. కాగా, దేశ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’కు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.. దీనిని జమ్మూకశ్మీర్ నుంచి ప్రారంభించడం ఉత్తమమని మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. జమ్మూకశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వానికి ఇదొక సువర్ణావకాశమన్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించే తేదీలను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను సరైన సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తామని చెప్పారు. కాశ్మీర్‌లోని మూడు స్థానాల్లో అభ్యర్థులను నిలబెడుతున్నట్లు ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.
మణిరత్నం ‘థగ్ లైఫ్’ నుంచి తప్పుకున్న స్టార్ హీరో.. శింబు ఎంట్రీ?
విశ్వనటుడు కమల్ హాసన్, దిగ్గజ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘థగ్ లైఫ్’. వీరిద్దరి కాంబినేషన్‌లో 1987లో వచ్చిన ‘నాయకుడు’ ఎంతటి ఘన విషయం సాధించిందో తెలిసిందే. 37 ఏళ్ల తర్వాత కమల్, మణిరత్నం కాంబోలో రూపొందనున్న థగ్ లైఫ్‌పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. మణిరత్నం, కమల్‌హాసన్, మహేంద్రన్, శివ అనంత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ తారాగణం ఉన్న థగ్ లైఫ్ నుంచి స్టార్ హీరో తప్పుకున్నట్లు తెలుస్తోంది. థగ్ లైఫ్ సినిమా నుంచి మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తప్పుకున్నాడట. సెట్స్‌లో అడుగుపెట్టకుముందే ఈ సినిమాకు అతడు గుడ్‌బై చెప్పాడు. డేట్స్ సర్ధుబాటుకాకపోవడం వల్లే ఈ మూవీ నుంచి దుల్కర్ బయటకు రావాల్సివచ్చిందని తెలుస్తోంది. థగ్ లైఫ్ నుంచి తాను వైదొలగడానికి గల కారణాలను కమల్, మణిరత్నంకు దుల్కర్ వివరించినట్లు తెలిసింది. అయితే దుల్కర్ స్థానంలో కోలీవుడ్ హీరో శింబును తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.
నన్ను మర్చిపోతారేమో అనే భయం ఎప్పుడూ ఉంటుంది..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ భామ ఇంతకు ముందులాగా వరుస సినిమాల్లో కనిపించడం లేదు. అసలు ఈ ఏడాది ఒక్క సినిమాతో అయినా ఈ భామ ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో క్లారిటీ అయితే లేదు. కానీ సామ్ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది . తాజాగా ప్రేక్షకులు తనను మర్చిపోతారేమో అన్న భయం ఎప్పుడూ ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ బ్యూటీ.‘‘చాలా పాత్రల్లో ప్రాధాన్యత లేకపోయినా నేను నటించాను. ఎందుకంటే ప్రతీ పోస్టర్ పై నేను ఉండాలని అనుకున్నాను కాబట్టి. అనుకున్నట్టే ఉన్నాను. ప్రతీ నెల నాకొక సినిమా రిలీజ్ ఉండేది. అలాంటప్పుడు మీరు నన్ను పట్టించుకోకుండా ఉండలేరు. అందరూ ప్రతీ నటిలో ఒక ఆలోచనను క్రియేట్ చేస్తారు. హీరోయిన్ అంటే కెరీర్ లైఫ్ తక్కువగా ఉంటుందని ఫిక్స్ అయిపోయేలా చేస్తారు. ఎక్కువగా బ్రేక్స్ తీసుకోలేమని అంటారు, కంటికి కనిపించకపోతే ప్రేక్షకులు మమ్మల్ని మర్చిపోతారని అంటారు’’ అంటూ ఒకప్పుడు వరుస సినిమాలు చేసిన రోజులను గుర్తుచేసుకొని, అందులో అన్నీ తనకు నచ్చి చేయలేదని తెలిపింది సమంత.‘‘ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను మంచి ప్రాజెక్ట్ వచ్చేవరకు ఎదురుచూస్తాను, సంవత్సరం పాటు బ్రేక్ తీసుకున్నాను అని చెప్పడం సులభమే. కానీ ప్రేక్షకుల కంటికి కనిపించకపోతే నన్ను మర్చిపోతారేమో అన్న భయం నాలో ఎప్పుడూ ఉంటుంది. నేను ప్రస్తుతం ఎక్కువ నిలకడగా ఉండడం లేదు. అయినా నేను ఈ భయాన్ని అధిగమించాలి. నేను పాత వార్తను అయిపోతానేమో అనే భయం వదిలేయాలి. మంచి రోల్ వచ్చే వరకు ఎదురుచూడాలి. ప్రేక్షకుల ఎదురుచూపులకు పూర్తి న్యాయం చేశానని అనిపించాలి. అన్ని అవకాశాలు నా ఎదురుగా వచ్చేవరకు ఎదురుచూస్తాను’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది..
రామ్ చరణ్ – బుచ్చిబాబు సినిమా టైటిల్ అది కాదా..మరి?
గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.. త్వరలోనే విడుదల కాబోతుంది.. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ Rc16 సినిమాను చేయబోతున్నాడు.. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో పీరియాడికల్ జోనర్ లో ఈ సినిమా ఉండబోతుంది. ఇక ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది… ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూట్ ను ఈ నెల 20 న సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ మూడు పాత్రల్లో నటించబోతున్నారు.. అయితే ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. గత కొన్ని రోజులుగా ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ను పిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. గ్రామీణ నేపథ్యంలో తెరకేక్కుతున్న ఈ సినిమాకు ఈ టైటిల్ సరిపోతుందని అదే పిక్స్ చేశారనే వార్త వైరల్ అవుతుంది.. ఇప్పటికే చరణ్.. ఈ సినిమాకు సంబంధించిన వర్క్ షాప్ లో పాల్గొనడం కూడా జరిగింది. ఆ క్యారెక్టర్స్ కూడా చరణ్ కు బాగా నచ్చాయని టాక్.. అయితే టైటిల్ ఇది కాదని మరో నాలుగు టైటిల్స్ ను పరీశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు సినిమా టైటిల్ తో పాటుగా సినిమాలో నటించే నటీనటుల గురించి ఈ నెల 20 వ తారీఖున వెల్లడించనట్లు సమాచారం.. ఎలాంటి టైటిల్ ను అనౌన్స్ చేస్తారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..