Sajjala Ramakrishna Reddy: వైసీపీ ఫైనల్ లిస్ట్.. సజ్జల కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండగా.. అంతకు ముందే.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, లోక్‌సభ 25 స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల్ని ప్రకటించేందుకు సిద్ధమైంది.. మార్పుచేర్పుల్లో భాగంగా ఇప్పటికే చాలా చోట్ల అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మార్చారు. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల గెలుపోటములపై సర్వేల ఆధారంగా ఇప్పటికే 70కి పైగా అసెంబ్లీ, 20కి పైగా లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేశారు. ఇక, ఈ రోజు ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి దగ్గర నివాళులర్పించి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మరోవైపు ఇడుపులపాయ చేరుకున్న వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: Mudragada Padmanabham: ముద్రగడ హాట్ కామెంట్స్.. సినిమాలు, రాజకీయలు ఏవీ వదలకుండా..!
Also Read
- Mamata Banerjee: బెంగాల్లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..
- Best Places to Visit in India in October: అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 10 ప్రదేశాలు అస్సలు మిస్ కావొద్దు..
- Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?
- BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాం.. ఇప్పుడు తుది జాబితాలోనూ అది కనిపిస్తుందన్నారు సజ్జల.. అభ్యర్థుల విషయంలో ఇప్పటికే స్పష్టత ఇచ్చాం.. పెద్దగా మార్పు ఉండవని స్పష్టం చేశారు.. ఐదేళ్లలో అభివృద్ధి.. సంక్షేమం విషయంలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాజీ పడలేదని స్పష్టం చేశారు.. ప్రస్తుతం ఉన్న విధానంలో వైసీపీ CAAను వ్యతిరేకిస్తుందన్నారు.. ఇక, 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ సీట్లను గెలిచే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. కాగా, మధ్యాహ్నం 12.40 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించనున్న సీఎం వైఎస్ జగన్.. మధ్యాహ్నం 12.58 గంటల నిమిషాల నుంచి ఒంటి గంటా 20 నిమిషాల వరకు వైసీపీ ముఖ్య నేతల సమక్షంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: బెంగాల్లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..
-
Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. మళ్లీ దేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా రికార్డ్!
-
Best Places to Visit in India in October: అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 10 ప్రదేశాలు అస్సలు మిస్ కావొద్దు..
-
Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?
-
Ganesh Immersion 2026 : గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు.. 20 వేల మంది పోలీసులతో నిఘా.!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!