తిరుపతి జిల్లాలోని వాకాడులో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి విగ్రహాన్ని మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ముఖ్యమంత్రి అయినా తరువాత ఇచ్చిన హామీలను అన్ని అమలు చేశారు.. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలవడం ఖాయం అని పేర్కొన్నారు.
ఇవాళ ప్రకాశం జిల్లాలోని అర్ధవీడు మండలంలోని 25 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రంగాపురం- అర్ధవీడు రోడ్డు నిర్మాణానికి గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఇంటింటికి మంచి నీటి కుళాయిలు అందిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఇవన్నీ మహిళల కోసం ప్రవేశ పెట్టాం.. ఇప్పుడు విద్యార్ధినుల కోసం కలలకు రెక్కలు పేరుతో మరో పథకం ప్రవేశపెట్టాం.. పేద విద్యార్థినులు కలల సాకారం చేసుకోవాలంటే ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి.. విద్యార్ధినుల ఉన్నత చదువుల కోసం బ్యాంక్ లోన్లు తీసుకునేలా మేం సహకరిస్తామన్నారు.
ముద్రగడ పద్మనాభం వైసీపీ లో చేరిక వాయిదా పడింది. గతంలో రేపు వైసీపీలో చేరతానని ఆయన ప్రకటించారు. అయితే, సెక్యూరిటీ కారణాలతో కిర్లంపూడి నుంచి తాడేపల్లి ర్యాలీని రద్దు చేసుకున్నారు. ఇక, ఈ నెల 15 లేదా 16 ముద్రగడ ఫ్యామిలీ మాత్రమే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్లు తెలిపారు.
నెల్లూరులో క్రీడాకారులకు క్రికెట్ కిట్లను వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావుతో పాటు జెడ్పీ చైర్మన్ అరుణమ్మ, మేయర్ స్రవంతి, జిల్లా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
పవన్ కల్యాణ్ ను మంచి మానసిక వైదుడుకి, ఎర్రగడ్డ ఆసుపత్రిలో చూపించాలనే అనుమానం వస్తుంది అని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. వ్యాధి ముదిరితే ప్రాణాంతకం అవుతుంది.. పోటీ చేసిన తర్వాత భీమవరం మొహం మళ్ళీ చూడలేదు.. కోవిడ్ సమయంలో ప్రజలు ఏం అయిపోయారు అనేది కూడా చూడలేదు..
గుంటూరు జిల్లాలో తెనాలి నాజర్ పేటలో కిరణా షాపు వ్యాపారి కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి శంకర్ రావు అనే వ్యాపారి కుటుంబం ప్రయత్నించింది. ఇక, భార్య, కుమార్తె కుటుంబం విష గుళికలు మింగారు.
ఇవాళ (బుధవారం) ఉదయం 9:32 గంటలకు సభ ఏర్పాట్లకు భూమిపూజ చేయాలని మూడు పార్టీలకు చెందిన నేతలు నిర్ణయించారు. చిలకలూరిపేట సభ ద్వారా జగన్ పతనానికి నాంది పలుకుతామని కూటమి నేతలు అంటున్నారు.