టీడీపీ మూడో జాబితా.. 11 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
ఇప్పటికే రెండు జాబితాల్లో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు మూడో జాబితాను విడుదల చేసింది.. 13 మంది లోక్‌సభ అభ్యర్థులు, 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది టీడీపీ అధిష్టానం.. ఇప్పటి వరకు 128 మంది అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ.. ఈ రోజు మూడో జాబితాను రిలీజ్ చేశారు..
టీడీపీ ఎంపీ అభ్యర్థులు
1. శ్రీకాకుళం- రామ్మోహన్ నాయుడు
2. విశాఖపట్నం – భరత్
3. అమలాపురం – గంటి హరీష్ మాధుర్
4. ఏలూరు – పుట్టా మహేష్ యాదవ్
5. విజయవాడ – కేశినేని చిన్ని
6. గుంటూరు- పెమ్మసాని చంద్రశేఖర్
7. నర్సరావుపేట – లావు శ్రీకృష్ణదేవరాయలు
8. బాపట్ల – టి. కృష్ణప్రసాద్
9. నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
10. చిత్తూరు – దగ్గుమళ్ల ప్రసాద్‌రావు
11. కర్నూలు – బస్తిపాటి నాగరాజు
12. నంద్యాల – బైరెడ్డి శబరి
13. హిందూపూర్-బీకే పార్థసారథి
టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు.
1. పలాస-గౌతు శిరీష
2. పాతపట్నం-మామిడి గోవింద్‌రావు
3. శ్రీకాకుళం-గొండు శంకర్
4. శృంగవరపుకోట-కోళ్ల లలితా కుమారి
5. కాకినాడ సిటీ-వెంకటేశ్వరరావు
6. అమలాపురం-అయితాబత్తుల ఆనందరావు
7. పెనమలూరు-బోడె ప్రసాద్
8. మైలవరం-వసంత వెంకట కృష్ణప్రసాద్
9. నర్సరావుపేట – చదలవాడ అరవింద్ బాబు
10. చీరాల మాలకొండయ్య
11. సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
దేవినేని ఉమకు షాక్ ఇచ్చిన టీడీపీ అధిష్టానం.. అది లేదు.. ఇది కూడా లేదు..!
మాజీ మంత్రి, సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు షాక్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం.. మైలవరం సీటు ఉమ ప్రత్యిర్థిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే.. ఈ మధ్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్ కు కేటాయించింది.. అయితే, వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన దేవినేని ఉమ.. నాలుగు సార్లు గెలిచి మంత్రిగా పనిచేశారు.. కానీ, గత ఎన్నికల్లో వసంత కృష్ణప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు.. ఓటమితోపాటు పార్టీలో ఆయనపై అసంతృప్తి ఉండటంతో.. ఈ సారి టికెట్ ఇవ్వకుండా టీడీపీ అధిష్టానం పక్కనబెట్టినట్టుగా తెలుస్తోంది.. వసంత.. టీడీపీలోకి రాకుండా, మైలవరం టికెట్ దక్కించుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారని ఉమామహేశ్వరరావుపై ఆరోపణలు ఉన్నాయి.. అతి సాధ్యం కాకపోవడం.. వసంత కృష్ణప్రసాద్ టీడీపీ గూటికి చేరడం.. ఈ సారి టికెట్ ఆయనకే దక్కుతుందనే ప్రచారం సాగుతోన్న తరుణంలో.. మైలవరం కాకపోయినా.. పెనమలూరు టికెట్ వస్తుందని భావించిందట దేవినేని ఉమ వర్గం.. కానీ, నాకు సీటు ఇవ్వా్ల్సిందే.. లేదంటే.. చంద్రబాబు ఫొటో పెట్టుకుని ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తానంటూ భీష్మించుకు కూర్చున్నారు మాజీ మంత్రి బోడే ప్రసాద్.. దీంతో.. చివరకు పెనమలూరు టికెట్‌ను బోడే ప్రసాద్‌కే కట్టబెట్టింది టీడీపీ అధిష్టానం.. ఇక, మైలవరం చేజారిపోవడమే కాదు.. ఆశించిన పెనమలూరు టికెట్ కూడా దేనినేని ఉమామహేశ్వరరావుకు రాకుండా పోయింది. మరి దేవినేని సేవలను టీడీపీ ఎలా ఉపయోగించుకోవాలని చూస్తుందో చూడాలి మరి.
పెనమలూరు సీటుపై వీడిన ఉత్కంఠ.. సంబరాల్లో బోడె ప్రసాద్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం సీటు కూడా కాక రేపింది.. వైసీపీ అధిష్టానం అనూహ్యంగా పెనమలూరు నుంచి మంత్రి జోగి రమేష్‌ని బరిలోకి దింపగా.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథి.. ఫ్యాన్ కింద నుంచి పక్కకు జరిగి సైకిల్ ఎక్కారు.. అయితే, పార్థసారథిని అక్కడి నుంచి బరిలోకి దింపకుండా పక్కను జరిపిన టీడీపీ అధిష్టానం.. నూజివీడు నియోజకవర్గం నుంచి పోటీక పెట్టింది.. అయితే, పెనమలూరు నుంచి ఎవరైతే బాగుంటుందనే తర్జనభర్జన పడింది.. సర్వేలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో పెనమలూరు ఇంచార్జ్‌గా ఉన్న బోడె ప్రసాద్‌కు టికెట్ లేదనే సందేశాన్ని పంపింది.. కానీ, పట్టువీడని విక్రమార్కుడిలా.. తన ప్రయత్నాలు కొనసాగించారు. చివరకు పెనమలూరు నియోజకవర్గ టీడీపీ టికెట్ బోడె ప్రసాద్ కు కేటాయించారు చంద్రబాబు. అయితే, మొదటి, రెండు విడతల్లో టికెట్ దక్కకపోవడంతో చంద్రబాబు, లోకేష్ ఫొటోతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను అని ప్రకటించారు బోడె ప్రసాద్. ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టిన బోడె ప్రసాద్ కు మూడో విడతలో టికెట్ కేటాయించడంతో.. ఆయన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.. మొత్తంగా పెనమలూరు సీటుపై ఉత్కంఠ వీడింది.. ఎట్టకేలకు బోడె ప్రసాద్ కు సీటు కేటాయించింది టీడీపీ అధిష్టానం.. తొలుత బోడెకు సీటు ఇవ్వలేమని చెప్పిన అధిష్టానం.. ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్ధిగా పోటీకి దిగుతానని.. చంద్రబాబు ఫొటోతో ప్రచారం చేస్తున్న బోడె వైపే మొగ్గుచూపింది.. ఇక, పెనమలూరు సీటు కోసం అనేక పేర్లు పరిశీలించింది టీడీపీ అధిష్టానం.. ఓ దశలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమా.. ఇలా రకరాల పేర్లు తెరపైకి వచ్చాయి.. చివరకు బోడెకే సీటు దక్కింది.. దీంతో, బోడె ప్రసాద్ కార్యాలయంలో సంబరాలు నిర్వహించాయి టీడీపీ శ్రేణుల.. చంద్రబాబుకి, పెనమలూరు ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాను అని ప్రకటించారు బోడె ప్రసాద్.. పెనమలూరు సీటు భారీ మెజార్టీతో గెలిచి చంద్రబాబుకి బహుమానంగా ఇస్తాను అన్నారు.. మూడో సారి సీటు ఇచ్చిన చంద్రబాబు, లోకేష్ కి రుణపడి ఉంటాను అన్నారు బోడె ప్రసాద్.
సోమిరెడ్డికి టీడీపీ టికెట్.. మంత్రి కాకాణి సంతోషం..!
జనసేన-బీజేపీ కూటమితో కలిసి ఎన్నికలకు సిద్ధం అవుతోన్న తెలుగుదేశం పార్టీ.. ఈ రోజు మూడో జాబితాను విడుదల చేసింది.. అయితే, ఈ సారి మాజీ మంత్రి, సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి టికెట్ వస్తుందా? రాదా? అనే చర్చ సాగింది.. కానీ, మూడో జాబితాలో ఆయనకు చోటు దక్కింది.. నెల్లూరు జిల్లా సర్వేపల్లి అసెంబ్లీ సీటును సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి కేటాయించారు టీడీపీ అధినేత చంద్రబాబు.. మొదటి, రెండు జాబితాల్లో సోమిరెడ్డికి చోటు దక్కకపోయినా.. మూడో జాబితాలో స్థానాన్ని దక్కించుకున్నారు. దీనిపై సోమిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.. ఇక, ప్రచారానికి సిద్ధం అవుతున్నారు. మరోవైపు.. మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి కూడా ఈ పరిణామాలపై ఆనందం వ్యక్తం చేశారు. సోమిరెడ్డికి టీడీపీ టికెట్ రావడంపై వంగ్యాస్త్రాలు సంధించిన మంత్రి కాకాణి… సోమిరెడ్డికి టికెట్ ఇవ్వడం సంతోషం అన్నారు. వరుసగా నాలుగు సార్లు ఓడిపోయారు.. రెండు జాబితాల్లో చోటు దక్కలేదు.. సీనియర్ నేత అని చెప్పుకొనే సోమిరెడ్డికి.. టికెట్ రావడంతో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.. సోమిరెడ్డికి టికెట్ ఇవ్వకుంటే నేను కూడా ఎన్నికల్లో ఎవరిపై మాట్లాడాలా అని అనుకున్నాను అన్నారు. కొత్తవాళ్లైతే విమర్శలు చేయడం కష్టం.. ఇక నా ఎన్నికల ప్రసంగాలు కూడా రంజుగా ఉంటాయి వ్యాఖ్యానించారు. మరోవైపు.. ఇదే చివరి ఎన్నిక అని సోమిరెడ్డి చెబుతున్నారు.. అంటే ఓటు వేస్తే వేయండి.. లేకుంటే లేదని అంటున్నారు అని ఎద్దేవా చేశారు. అయితే, ఆయనను ఎన్నికల్లో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు మంత్రి కాకాణి.
బెజవాడ పార్లమెంట్.. అన్నదమ్ముల మధ్య ఆసక్తికర పోరు
బెజవాడ పార్లమెంట్ స్థానంలో ఈ సారి ఆసక్తికరమైన పోరు జరగనుంది.. లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ నుంచి ఈసారి అన్నదమ్ముల పోరు తప్పదా? అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి అన్నదమ్ములు బరిలోకి దిగే అవకాశముందా? అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది.. మారిన రాజకీయ పరిణామాలతో టీడీపీకి గుడ్‌బై చెప్పిన విజయవాడ ఎంపీ కేశినేని నాని.. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.. ఇక, ఆ తర్వాత కేశినేని నానిని విజయవాడ లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించారు వైఎస్ జగన్.. మరోవైపు.. టీడీపీ అప్పటి నుంచి మరింత యాక్టివ్ అయ్యారు కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని.. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేసిన మూడో జాబితాలో.. బెజవాడ లోక్‌సభ నుంచి బరిలో దిగుతున్నారు కేశినేని చిన్ని.. దీంతో.. బెజవాడలో అన్నదమ్ముల మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది.
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత..!
హైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు అధికారులు. దాదాపు 9 కోట్ల రూపాయల విలువచేసే డ్రగ్స్ ను డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం పరుచుకున్నారు. ఐడియా బొల్లారంలోని ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా ఇంటర్ పోల్ సమాచారం రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇంటర్ పోల్ సహాయంతో పీఎస్ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సోదాలు నిర్వహించారు. నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. 90 కిలోల మెపీడ్రిన్ డ్రగ్స్ ని.. డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. గత పది సంవత్సరాల నుంచి డ్రగ్స్ తయారు చేసి విదేశాలకి తరలిస్తున్న కస్తూరి రెడ్డి నల్లపొడి అరెస్టు చేశారు. సిగరెట్ ప్యాకెట్లలో డ్రగ్స్ ను పెట్టి విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. కొంతవరకు హైదరాబాదులో కూడా డ్రగ్స్ సప్లై చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ పోల్ సహాయంతో డ్రగ్స్ రాకెట్టు గుట్టురట్టు చేసినట్లు కమలహాసన్ రెడ్డి తెలిపారు. పీఎస్ఎన్ కంపెనీ పలు దేశాలకు డ్రస్సును సరఫరా చేస్తున్నట్లుగా సమాచారం.
చీలిపోతున్న భారత కూటమికి కేజ్రీవాల్ అరెస్ట్తో బూస్టింగ్..
లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు భారత కూటమికి పెద్ద దెబ్బగా రుజువు చేస్తుందా లేదా ప్రతిపక్ష శిబిరాన్ని బలోపేతం చేస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు. కేజ్రీవాల్ అరెస్టుపై భారత కూటమి సంఘీభావం తెలిపింది. అంతే, కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలను కూడా బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఇండియా కూటమి ఆరోపించింది. ఈ సందర్భంగా TMC చీఫ్ విప్ డెరెక్ ఓ’బ్రియన్ మాట్లాడుతూ.. “సిట్టింగ్ ముఖ్యమంత్రులు, కీలక ప్రతిపక్ష నాయకులను లోక్‌సభ ఎన్నికలకు కొన్ని వారాల ముందు అరెస్టు చేస్తే.. దేశంలో ఎన్నికలను ఎలా ఆశించగలం అని ప్రశ్నించారు. అయితే, ఇటీవల ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేజ్రీవాల్‌కు బహిరంగంగా మద్దతు పలికింది. ఈడీ బృందం ఢిల్లీ సిఎంను అరెస్టు చేయడానికి ముందు. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ సీఎం కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. ఇది కాకుండా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా అరవింద్ కేజ్రీవాల్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వడంతో పాటు బీజేపీపై విమర్శలు పర్వం కురిపించారు.
18 నెలల్లో 16 మంది అరెస్ట్.. లిక్కరు కేసులో ఇప్పటివరకు జైలుకు వెళ్లింది ఎవరంటే ?
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిన్న రాత్రి విచారణ అనంతరం అరెస్టు చేసింది. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ అంశాలకు సంబంధించిన దర్యాప్తునకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఆయనకు ఎలాంటి భద్రతను ఇవ్వడానికి నిరాకరించిన కొన్ని గంటల తర్వాత కేజ్రీవాల్ అరెస్టు జరిగింది. ఈ కేసులో ఇది 16వ అరెస్టు. వారం రోజుల క్రితం అంటే మార్చి 15న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుమార్తె, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకురాలు కే కవితను హైదరాబాద్‌లో ఈడీ అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు కూడా ఆమె పై ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌లను ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది. ఇప్పుడు ఈ కేసులో నాలుగో హై ప్రొఫైల్ అరెస్ట్ జరిగింది. PMLA సెక్షన్ 3, సెక్షన్ 4 కింద మనీలాండరింగ్ ఆరోపణలపై ఈ నాయకులను అరెస్టు చేశారు.
అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్.. ట్రెండింగ్‌లోకి వచ్చిన సత్యపాల్ మాలిక్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత పలువురు నేతల ప్రకటనలు వస్తున్నాయి. కాంగ్రెస్ వైపు నుంచి రాహుల్ గాంధీ, సందీప్ దీక్షిత్ వంటి నేతలు ఆయనకు అండగా ఉంటామని చెప్పగా, అఖిలేష్ యాదవ్ వంటి నేతలు కూడా అరెస్ట్ పై ప్రశ్నలు సంధించారు. కాగా, సత్యపాల్ మాలిక్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసే అవకాశం ఉందని గతేడాది ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అతని మాటలు సరైనవని నిరూపించబడింది. అతని ప్రకటన క్లిప్‌ను పంచుకుంటూ మాలిక్ అంచనా సరైనదని రుజువైంది అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సత్యపాల్ మాలిక్ కూడా ట్వీట్ చేస్తూ.. ఎన్నికలకు ముందే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తారని నేను ముందే చెప్పాను. అంతే కాదు పీఎం నరేంద్ర మోడీ పేరు చెప్పకుండా సత్యపాల్ మాలిక్ దాడి చేశాడు. అధికార పీఠంపై కూర్చున్న నియంత పిరికివాడని, దేశంలోని ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. సత్యపాల్ మాలిక్ గత కొన్నేళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీపై నేరుగా దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. కాపు ఉద్యమం నుంచి మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ఆ పాటకు దద్దరిల్లిన సినిమా థియటర్.. నువ్వు నేను రీరిలీజ్..!
ఇదివరకు లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ ఎన్నో ఎవర్ గ్రీన్ సినిమాల్లో నటించి మెప్పించాడు. ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలలో ‘నువ్వు నేను’ సినిమా ఒకటి. తాజాగా ఈ సూపర్ హిట్ సినిమా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు మరోసారి వచ్చింది. ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహించారు. అప్పట్లోనే ‘నువ్వు నేను’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కొత్త రికార్డ్స్ ను కూడా సృష్టించింది. ఈ సినిమా మొత్తానికి ఉదయ్ కిరణ్ నటన, ఆర్ఫీ పట్నాయక్ అందించిన సంగీతం హైలైట్. ఈ సినిమాలో హీరోయిన్ గా అనిత నటించింది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందేగా.. ఇందులో భాగంగానే చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులని ఎంటర్టైన్మెంట్ చేసాయి. కేవలం సూపర్ హిట్ అయినా సినిమా మాత్రమే కాకుండా., డిజాస్టర్ గా నిలిచిన సినిమాలు కూడా ఇప్పుడు రీ రీలీజ్ అయ్యి కలెక్షన్స్ తో అదరగొడుతున్నాయి. ఇదే కోవలోకి ఇప్పుడు ‘నువ్వు నేను’ సినిమా కూడా ఇప్పుడు రీరిలీజ్ అయ్యింది. మొదటిసారి సూపర్ హిట్ అయ్యినప్పుడు ఎలా ఇష్టపడ్డారో.. అలాగే ఇప్పుడు కూడా ఈ సినిమా సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. తాజాగా నువ్వు నేను సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు మరోసారి వచ్చింది. ప్రస్తుతం థియేటర్స్ లో ఈ సినిమాని ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు.
‘హనుమాన్’ కాన్సెప్ట్ తో హాలీవుడ్ మూవీ.. ఆకట్టుకుంటున్న సెకండ్ ట్రైలర్..
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇప్పుడు ఆ హిందూ మైథాలాజీ కాన్సెప్ట్ హలీవుడ్ వరకూ వెళ్లింది. పురాణాల్లోని హనుమంతుడి పాత్ర స్ఫూర్తితో ఇప్పుడు ‘మంకీ మ్యాన్’ అనే ఇంగ్లీష్ సినిమాను తెరకెక్కించారు.’స్లమ్ డాగ్ మిలియనీర్’ ‘హోటల్ ముంబై’ ఫేమ్ దేవ్ పటేల్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మంకీ మ్యాన్’. ఇందులో శోభిత ధూళిపాళ్ళ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటి వరకూ తెలుగు, తమిళ మరియు హిందీ భాషల్లో తన ప్రతిభను చాటుకున్న శోభిత ఈ సినిమాతో హాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. ఆల్రెడీ ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో లేటెస్టుగా మరో ట్రైలర్ ను మేకర్స్ అవిష్కరించారు. చిన్నతనంలోనే తల్లితో పాటుగా సర్వస్వం కోల్పోయిన హీరో.. ‘ధనవంతులు మమ్మల్ని మనుషులుగా కూడా చూడరు’ అంటూ తన గురించి చెప్పుకోవడంతో ‘మంకీ మ్యాన్’ ట్రైలర్ 2 ప్రారంభం అవుతుంది. పేద ప్రజలను కాపాడే వ్యక్తిగా తాను భావిస్తూ, హనుమంతుడిని స్ఫూర్తిగా తీసుకొని ఫైట్ చేసే యువకుడి కథే ఈ సినిమా అని అర్థమవుతోంది. ఇందులో ఒక వెయిటర్ గా కనిపిస్తున్న దేవ్ పటేల్.. ఒక ఫైటర్ గా మారి తన తల్లి మరణానికి కారణమైన వ్యక్తిపై రివేంజ్ తీర్చుకోడానికి అతను ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.”రాక్షస రాజు, తన సైన్యం కలిసి ప్రజలను భయపెట్టేవారు. అప్పుడే వారికి ప్రజల రక్షకుడు ఎదురయ్యాడు. ది వైట్ మంకీ” అంటూ ఫస్ట్ ట్రైలర్ లోనే ‘మంకీ మ్యాన్’ కాన్సెప్ట్ ఏంటనేది వెల్లడించారు. ఇప్పుడు ట్రైలర్-2 లో “ఒక మనిషి దేవుడిని సవాలు చేస్తే.. అతను మనిషి కంటే ఎక్కువగా, మృగం కంటే ఎక్కువగా మారాలి” అని చెప్పడం ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది.అదిరిపోయే యాక్షన్ తో పాటుగా ఎమోషనల్ కంటెంట్ కలగలిపి వచ్చిన ‘మంకీ మ్యాన్’ రెండో ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
దేవర ఇన్ యాక్షన్..ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది మావ..
గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ దేవర సినిమా పై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి.. ట్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్న యాక్షన్ సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ కోసం వెయిట్ చేస్తున్నారు.. సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ కూడా సినిమా పై బజ్ ను క్రియేట్ చేస్తున్నాయి.. ఈ సినిమా కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.. ప్రస్తుతం సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది.. గోవా షెడ్యూల్ లో సినిమాలోని యాక్షన్ సన్నివేశాలతో పాటు జాన్వీ కపూర్ తో ఓ సాంగ్ ను చిత్రీకరించనున్నారు.. ఈరోజు ఈ సినిమా సెట్ నుంచి ఓ వీడియో లీక్ అయిన విషయం తెలిసిందే.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా నుంచి షూటింగ్ లొకేషన్ నుంచి ఒక ఫోటోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ ఫొటోలో ఎన్టీఆర్, కొరటాల శివ ఉన్నారు. ఎలాంటి అప్డేట్ లేకుండా వర్కింగ్ స్టిల్ తో ఎన్టీఆర్ ఫోటోని రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.. ఆ ఫొటోలో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది. ఊరమాస్ లుక్ లో కనిపిస్తున్నారు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫోటోను తెగ వైరల్ చేస్తున్నారు..