జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చిరంజీవి లాగే పవన్ కల్యాణ్ తన పార్టీని అమ్ముకుంటున్నాడు.. తమ్ముడు కల్యాణ్ ఎంపీగా పోటీ చేసి వేల కోట్లు సంపాదించాలని అనుకుంటున్నాడు అంటూ ఆరోపించారు. ఇక, పవన్ తనకు ఒక్క సీటు ఇచ్చినా చాలనుకుంటాడు.. నాదెండ్ల మనోహర్‌కు సీటు లేదన్నా ఒకే అంటారంటూ సెటైర్లు వేశారు.
గతంలో బైబై పేరుతో కౌంట్‌డౌన్ క్లాక్ ఏర్పాటు చేసినట్టుగానే.. ఇప్పుడు మరో 73 రోజుల్లో తిరిగి అధికారంలోకి వస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ''జగన్ అనే నేను'' పేరుతో కౌంట్‌డౌన్ క్లాక్‌లు ఏర్పాటు చేశారు..
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నిర్వహణకు షెడ్యూల్లు విడుదల చేసిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు డీఎస్సీ-2024 షెడ్యూల్లో మార్పులు చేసింది ప్రభుత్వం.. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ ప్రకటన విడుదల చేశారు..
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు (మంగళవారం) విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరి కృష్ణలంక కనకదుర్గమ్మ వారధి దగ్గరకు చేరుకోనున్నారు. అక్కడ కొత్తగా నిర్మించిన ఇరిగేషన్ రిటైనింగ్ వాల్, రివర్ ఫ్రంట్ పార్కును ఆయన ప్రారంభించనున్నారు.