రాష్ట్రపతి ఇవాల ఉదయం 11.00-12.00 షేక్‌పేటలోని జి.నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మహిళా కళాశాల సందర్శన. విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశం కానున్నారు. సాయంత్రం 5.00-6.00 శంషాబాద్‌లోని శ్రీరామ్‌నగర్‌లో సమైక్యతామూర్తి శ్రీ రామానుజాచార్య విగ్రహ సందర్శించనున్నారు.
కశ్మీర్ వరకు రాహుల్ పాదయాత్రలో మనం కూడా పాల్గొనాలని, వ్యక్తిగత అంశాలు చర్చ పెట్టకుండా ..ప్రజల సమస్యలపై చర్చ పెట్టాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు సలహా ఇచ్చారు.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు త్వరలో బ్యాడ్ న్యూస్ అందనుంది. మెట్రో రైలు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఛార్జీల పెంపుపై హైదరాబాద్ మెట్రో అధికారులు ఇప్పటికే సెంట్రల్ ఫేర్ ఫిక్సేషన్ కమిటీకి ప్రతిపాదనలు పంపారు.
క్రిస్మస్ పండగ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. ఇడుపులపాయల నుంచి హెలికాప్టర్లో పులివెందుల చేరుకున్న సీఎం జగన్ సీఎస్ఐ చర్చికి వెళ్లి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత క్రమంగా పెరిగింది. ఇక.. అక్టోబర్ నెలలో చూస్తే పదేళ్లలో ఎప్పుడు లేని విధంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఈ నెలలోనూ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్న నేపథ్యంలో.. ఉదయం పొగ మంచు కురుస్తుంది.
MohanBabu University: స్వప్నించు (డ్రీమ్), విశ్వసించు (బిలీవ్), సాధించు (అఛీవ్) అని బోధిస్తున్న మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ).. అనుభవజ్ఞులు, అత్యుత్తమ ప్రతిభ కలిగినవారు, అకడమిక్ లీడర్స్ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంబీయూ సక్సెస్ స్టోరీలో పాలుపంచుకోవాలని కోరుతోంది. విద్యా రంగంలో 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో, నమ్మకానికి మారుపేరుగా మారిన తమ సంస్థల్లోని వివిధ ఉద్యోగాల భర్తీకి నియామక ప్రకటన జారీ చేసింది.
AP High Court: విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద ప్రతి ప్రైవేట్ స్కూల్లోనూ 25 శాతం సీట్లను ఆర్థికంగా వెనకబడిన పిల్లలకు ఉచితంగా ఇవ్వాలి. కానీ ఈ చట్టం పెద్దగా అమలైనట్లు కనిపించట్లేదు. ఇదే విషయాన్ని ఓ న్యాయవాది ఏపీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. దీంతో న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై సీరియస్ అయింది. ఈ మేరకు గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలుచేయలోదో వివరణ ఇవ్వాలని కోరింది.
తన సొంత నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు.. కొన్ని ప్రాంతాల్లో.. చంద్రబాబు టూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. శాంతిపురం మండలం, కొంగణపల్లిలో చంద్రబాబు మాట్లాడుతూ.. కుప్పం నియోజకవర్గంపై ప్రభుత్వానికి శీతకన్ను వేసింది ఫైర్ అయ్యారు.. నేను ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా అని ఇక్కడ ఏ పనులు చెయ్యడం లేదని ఆరోపించిన ఆయన.. ఈ చేతగాని ప్రభుత్వం… మిగిలిపోయిన హంద్రీ నీవా పనులు పూర్తి చేయలేదన్నారు.. నేను నాడు పులివెందులలో పంటలు ఎండిపోతుంటే సాగు నీరు…
Vijayawada: మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికావొస్తున్న శుభసందర్భంగా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్‌కి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. ప్రభుత్వాధికారులు, ప్రైవేట్ సంస్థలు సంయుక్తంగా నగరాన్ని అడుగడుగునా అందంగా, దేశభక్తి