రాష్ట్రపతి ఇవాల ఉదయం 11.00-12.00 షేక్‌పేటలోని జి.నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మహిళా కళాశాల సందర్శన. విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశం కానున్నారు. సాయంత్రం 5.00-6.00 శంషాబాద్‌లోని శ్రీరామ్‌నగర్‌లో సమైక్యతామూర్తి శ్రీ రామానుజాచార్య విగ్రహ సందర్శించనున్నారు.
కశ్మీర్ వరకు రాహుల్ పాదయాత్రలో మనం కూడా పాల్గొనాలని, వ్యక్తిగత అంశాలు చర్చ పెట్టకుండా ..ప్రజల సమస్యలపై చర్చ పెట్టాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు సలహా ఇచ్చారు.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు త్వరలో బ్యాడ్ న్యూస్ అందనుంది. మెట్రో రైలు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఛార్జీల పెంపుపై హైదరాబాద్ మెట్రో అధికారులు ఇప్పటికే సెంట్రల్ ఫేర్ ఫిక్సేషన్ కమిటీకి ప్రతిపాదనలు పంపారు.
క్రిస్మస్ పండగ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. ఇడుపులపాయల నుంచి హెలికాప్టర్లో పులివెందుల చేరుకున్న సీఎం జగన్ సీఎస్ఐ చర్చికి వెళ్లి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.