* విజయవాడ: నేడు మూడో దశ ఉద్యమ కార్యాచరణ ప్రకటన చేయనున్న ఏపీ జేఏసీ అమరావతి.. అఖిల భారత జైహింద్ పార్టీ అధ్వర్యంలో స్పెషల్ స్టేటస్‌పై సమావేశం.. సమావేశానికి హాజరు కానున్న సినీ నటుడు రాంకీ
* నేడు విజయవాడలోని గుడివాడ బస్టాండ్ డిపోను ప్రారంభించనున్న మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని
* కాకినాడ: అన్నవరం సత్యదేవుని ఆలయంలో నేటి నుంచి కళ్యాణ మహోత్సవాలు.. ఉత్సవాలు జరిగే ఏడు రోజులపాటు ఆర్జిత సేవలు నిలిపివేత.. రేపు రాత్రి స్వామి వారి కళ్యాణం, ఊరేగింపు కార్యక్రమం
* ఏలూరు: నేటి నుండి ద్వారకాతిరుమల చిన వెంకన్న వైశాఖమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. మే 4వ తేదీన స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం, 5న స్వామివారి రథోత్సవం, 7వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలు
* బాపట్ల: చినపులివర్రు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున
* విశాఖ: సింహాచలం చందనోత్సవం వైఫల్యాలపై విచారణకు మరో కమిటీ.. ఉత్సవాల్లో తప్పిదాలపై విచారణ బాధ్యతలు అడిషనల్ కమిషనర్ చంద్రకుమార్‌కు అప్పగింత.. నిజరూప దర్శనం వేళ భక్తులకు కలిగిన అసౌకర్యంపై ఇప్పటికే జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎంక్వైరీ
* తూర్పుగోదావరి జిల్లా: నేడు హోంమంత్రి తానేటి వనిత ఉదయం 11:30 నిమిషాలకు రాజమండ్రి సిటీ లలిత నగర్ నందు ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని.. సాయంత్రం 04:00 గంటలకు తాళ్లపూడి మండలం అన్నదేవరపుపేట నందు జరుగు గడప గడపకు మన ప్రభుత్వం(103 వ రోజు) కార్యక్రమంలో పొల్గొననున్నారు.
* విజయవాడ: నేటి నుంచి జగ్గయ్యపేట వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మత్సవాలు ప్రారంభం.. నేటి నుంచి వారం పాటు జరగనున్న బ్రహ్మోత్సవాలు
* వరంగల్: శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణం బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు డోలోత్సవం.. ఉదయం భద్రపీఠ సేవలో సాయంత్రం అశ్వవాహన సేవలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న అమ్మవారు
* ఖమ్మం: నేడు హైదరాబాద్‌లో సీతారాం ప్రాజెక్ట్ పనులపై సమీక్ష.. పాల్గొననున్న ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు
* ఖమ్మం: నేడు కానిస్టేబుల్ తుది రాత పరీక్ష కోసం.. 12156 మంది అభ్యర్థులు 21 పరీక్ష కేంద్రాలు
* నేటితో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగియనున్న సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పీపుల్ మార్చ్ పాదయాత్ర.. నేడు జనగామ నియోజకవర్గంలో కొనసాగి, రాత్రికి ఆలేరు నియోజకవర్గంలోకి ప్రవేశించనున బట్టి పాదయాత్ర