విజయవాడ సిద్దార్థ వైద్య కళాశాలల్లో ఐదుగురు విద్యార్థులు మాల్ ప్రాక్టీసుకి పాల్పడుతూ పట్టుబడ్డారు. ఈ అంశంపై స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మాల్ ప్రాక్టీసులో వైద్య కళాశాలలో కీలక విభాగం నిర్లక్ష్యం ఉన్నట్టు నిర్ధారణ విచారణలో తేలింది. 12 మందిపై చర్యలు తీసుకోవాలని నివేదిక తేల్చింది. కళాశాల సూపరెండెంట్ ఎగ్జామినర్, డిప్యూటీ సూపరింటెండెంట్, 8 మంది ఇన్విజలేటర్లు, ఇద్దరు క్లర్క్ లపై చర్యలకు సిఫార్సు చేసింది. ఉద్యోగులపై బదిలీ లేదా కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కేసు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నివేదిక రేపు ప్రభుత్వానికి చేరనుంది.
READ MORE: Azharuddin: ఉప్పల్ స్టేడియంలో టీమిండియా మాజీ కెప్టెన్ పేరు తొలగింపు.. అజారుద్దీన్ రియాక్షన్ ఇదే..
ఇదిలా ఉండగా.. సిద్దార్ధ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ కలకలం రేపింది. గత శనివారం కమ్యూనిటీ మెడిసిన్ (పార్ట్ 1) పరీక్ష రాస్తూ ఇద్దరు విద్యా్ర్థులు పట్టుబడ్డారు. మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన విద్యార్థులను ఎన్నారై, నిమ్రా కళాశాల విద్యార్థులుగా గుర్తించారు. 160 మంది విద్యార్దులు పరీక్ష రాస్తుండగా ఇద్దరు పట్టుబడ్డారు. ఇటీవల కూడా ముగ్గురు విద్యార్థులు ఇలాగే దొరికి పోయారు. మొత్తం ఐదు మంది విద్యార్థులు పట్టుబడ్డారు. వరుస మాల్ ప్రాక్టీసు ఘటనలతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. విచారణ చేపట్టగా అసలు విషయం తెలిసింది.
READ MORE: Pragya Jaiswal : బాబోయ్.. ప్రగ్యాజైస్వాల్ అరాచకమే..