R.S.Brothers : కనకదుర్గ సన్నిధిలో ఆర్.ఎస్.బ్రదర్స్ 2వ షోరూమ్.. ప్రారంభించిన కీర్తి సురేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
R.S.Brothers : దక్షిణ భారతదేశంలోని కుటుంబాలలోని అన్ని తరాలవారి అభిరుచులనూ ప్రతిబింబించే విశ్వసనీయ బ్రాండ్ ఆర్.ఎస్. బ్రదర్స్ , 18.04.2025న విజయవాడలో రెండవ షోరూమ్‌కు శుభారంభం చేసి, తమ రిటైల్ ప్రయాణంలో కీలకమైన మరో ఘట్టాన్ని నమోదు చేసుకుంది! శ్రీ పి.వెంకటేశ్వరులు, శ్రీ ఎస్.రాజమౌళి, శ్రీ టి.ప్రసాదరావు మరియు కీ॥శే॥ పి.సత్యనారాయణ గార్లు దూరదృష్టితో స్థాపించిన ఆర్.ఎస్. బ్రదర్స్` సంప్రదాయం, శైలి, మరియు సరసమైన ధరల సమ్మేళనంతో కుటుంబంలోని అన్ని తరాల వారికి అద్భుతమైన షాపింగ్ అనుభూతిని అందించడంలో అగ్రశ్రేణిలో ఉంటోంది.
ఏప్రిల్ 18న జరిగిన ఈ ప్రారంభోత్సవం` ఫ్యాషన్, సాంస్కృతిక విలువలు, మరియు ఉత్సవ శోభను ప్రతిబింబించింది. విజయవాడ లోక్‌సభ సభ్యులు శ్రీ కేశినేని చిన్ని గారు, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గ సభ్యులు శ్రీ బొండా ఉమామహేశ్వర రావు గారు, కార్పొరేటర్ శ్రీ నెల్లిబండ్ల బాలాస్వామి గారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి, ఆర్.ఎస్. బ్రదర్స్ వారు తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ రంగానికి అందిస్తున్న సేవల గురించి ప్రోత్సాహకరంగా ప్రసంగించారు.
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..

ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా, జాతీయ అవార్డు గ్రహీత, సుప్రసిద్ధ నటీమణి శ్రీమతి కీర్తి సురేష్ గారు విచ్చేసి, జ్యోతి ప్రజ్వలనతో మంగళప్రదమైన శుభారంభాన్ని అందించారు. అనంతరం ఆమె- ఆర్.ఎస్ బ్రదర్స్ వారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పిన రెండవ షోరూమ్‌లోని వైవిధ్యభరితమైన వస్త్రశ్రేణిని సందర్శించి, ‘‘విజయవాడ, ఆ పరిసరాల్లోని షాపింగ్ ప్రియులు ఈ మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అన్ని రకాల వేడుకలకు అనువైన షాపింగ్ కోసం ఈ షోరూమ్‌ను తప్పక సందర్శించాలని, ఇక్కడి షాపింగ్ అనుభూతిని గుర్తుండిపోయే ఘట్టంగా హృదయాల్లో పదిలపరచుకోవాల’’ని అన్నారు.

విజయవాడ బీసెంట్ రోడ్ క్రాస్, ఏలూరు రోడ్‌లో ఏప్రిల్ 18న శుభారంభం జరుపుకున్న ఆర్.ఎస్. బ్రదర్స్ సరికొత్త షోరూమ్- రానున్న పెళ్ళి సంబరాలకు ఆహ్లాదకరమైన కొత్త కలెక్షన్లను సిద్ధం చేసింది. ఇందులో మహిళలు, పురుషులు, పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అద్భుతమైన వివాహ కలెక్షన్లలో అన్నిరకాల వస్త్రశ్రేణులూ షాపింగ్ ప్రియుల్ని తప్పక అలరిస్తాయి. విలాసవంతమైన కంచిపట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, పెట్టుడు చీరలు, నక్షత్రాల్లాగా అల్లిన లెహంగాలు, సొగసైన షెర్వాణీలు, ఉత్సవ కుర్తాలు, ముద్దుగా కనిపించే కిడ్స్‌వేర్… ఇలా ఎన్నో రకాల ఫ్యాషన్ ఎంపికలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ ధరలు కూడా కేవలం రూ.150 నుంచి ఉండటం విశేషం. బడ్జెట్ ఏదైనా, ప్రతి ఒక్కరికి తగిన దుస్తులు ఇక్కడ లభిస్తాయి.
R.S.B. రిటైల్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్లు శ్రీ పి.వెంకటేశ్వర్లు, శ్రీ ఎస్.రాజమౌళి, శ్రీ టి.ప్రసాదరావు గారు, ఆంధ్రప్రదేశ్‌లో తమ బ్రాండ్ వేగంగా విస్తరిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబానికి శ్రేష్ఠమైన, నాణ్యమైన దుస్తులను సాంస్కృతిక విలువలు కలగలిపిన శైలిలో అందించాలన్నదే తమ లక్ష్యమని వారు తెలిపారు. ఆధునిక ధోరణులకు అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న తమ ప్రయాణాన్ని వారు వివరించారు.

ఈ నూతన ప్రారంభోత్సవం ద్వారా ఆర్.ఎస్. బ్రదర్స్ తమ కస్టమర్ల నమ్మకాన్ని మరింత బలపరుస్తోంది. ఓవైపు నాలుగు లక్షలకుపైగా వైవిధ్యభరితమైన మోడళ్ళు విజయవాడ షాపింగ్ ప్రియులను ఆహ్వానిస్తున్నాయి. సంప్రదాయ వస్త్రాలు, పెట్టుడు చీరలు, పండుగలకై ప్రత్యేక కలెక్షన్లు, పాశ్చాత్య వస్త్రాలు, బ్రాండెడ్ మెన్స్‌వేర్ తదితరాలన్నీ అందుబాటులో ఉండి, ప్రతి సందర్భాన్ని మరపురాని అనుభూతిగా మార్చే విధంగా, అత్యంత ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన వస్త్రసంపద మీకోసం ఎదురుచూస్తోంది.
పెళ్ళి వేడుకలకు సిద్ధమవుతున్నా, కుటుంబానికి షాపింగ్ చేస్తున్నా ఇదే సరైన సమయం! ఆర్.ఎస్. బ్రదర్స్ మీ ఫ్యాషన్, సంప్రదాయం, ఉత్తమ విలువలకు సవినయంగా స్వాగతం పలుకుతోంది! పండుగలా సాగే సరదా షాపింగ్ అనుభూతి కేవలం బీసెంట్ రోడ్ క్రాస్, ఏలూరు రోడ్, విజయవాడ ఆర్.ఎస్. బ్రదర్స్‌లో మాత్రమే!
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!