Minister Nadendla: విశాఖపట్నంలో పీడీఎస్ రైస్ గుర్తించే రాపిడ్ కిట్స్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరం కాకినాడ పోర్టులో జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై అధ్యయనం చేసి చర్యలు చేపట్టాం.. కాకినాడ నుంచి రవాణా అయ్యే ప్రతి సరుకును పరిశీలించి మన దేశానికి చెందిన పీడీఎస్ రైస్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
Vadarevu Beach Tragedy: సెలవు రోజుల్లో సరదాగా గడిపేందుకు వెళ్లిన పాపానికి రాకాసి అలలు ముగ్గురిని బలి తీసుకున్నాయి. ఈ విషాదకరమైన ఘటన బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు తీరంలో వెలుగుచూసింది. సముద్రంలో స్నానానికి దిగిన ఐదుగురు అలల తాకిడికి గల్లంతయ్యారు. వారిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు అధికారులు చెప్పారు. READ ALSO: Shiva : నాగార్జున ’శివ’ రీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరదాగా గడిపేందుకు సెలవు రోజుల్లో…
Physical harassment: అన్నమయ్య జిల్లాలో మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు బస్సులో ప్రయాణిస్తున్న యువతులను వేధించిన ఘటన సంచలనం రేపింది. మొటుకుపల్లి నుంచి మదనపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ సంఘటన చోటు చేసుకుంది.
Bomb Threat in Tirupati: తిరుపతికి మరో బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. ఇస్కాన్ టెంపుల్ లో బాంబులు పెట్టామని ఆ మెయిల్ లో హెచ్చరించారు. మొత్తం మూడు లొకేషన్లలో IEDలు ఉన్నాయని దుండగులు ఈ మెయిల్ ద్వారా వార్నింగ్ ఇచ్చారు.
Minor Rape Case: చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఈ నెల 25వ తేదీన చిత్తూరులోని నగరవనం పార్కుకు వెళ్లిన ప్రేమ జంటను ముగ్గురు దుండగులు అడ్డుకున్నారు.