Bomb Threat in Tirupati: తిరుపతికి మరో బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. ఇస్కాన్ టెంపుల్ లో బాంబులు పెట్టామని ఆ మెయిల్ లో హెచ్చరించారు. మొత్తం మూడు లొకేషన్లలో IEDలు ఉన్నాయని దుండగులు ఈ మెయిల్ ద్వారా వార్నింగ్ ఇచ్చారు. దీంతో అప్రమత్తమన అధికారులు ఉదయం నుంచి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో అత్యవసర తనిఖీలు కొనసాగిస్తున్నారు. తప్పుగా హ్యాండిల్ చేస్తే పేలిపోయే ప్రమాదం ఉందని సూచిస్తూ మరో మెయిల్ కూడా పంపినట్లు సమాచారం. ఆలయాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్ దగ్గర క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. కరూర్ తొక్కిసలాట కేసును CBIకి బదిలీ చేయాలని కూడా అదే ఇమెయిల్‌లో డిమాండ్ చేశారు. సైబర్ సెల్ ఈ-మెయిల్ మూలాన్ని గాలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బ్లాస్ట్స్ తర్వాత sniper దాడులు జరుగుతాయని అందులో వెల్లడించారు.