MP Mithun Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఏ-4గా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. సుమారు 71 రోజుల పాటు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డికి ఇవాళ ( సెప్టెంబర్ 29న) ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Read Also: Sajjal Ramakrishna Reddy: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. రేపు నిరసనలకు పిలుపునిచ్చిన వైసీపీ
అయితే, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విడుదల కావడంతో.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు వైసీపీ ముఖ్యనేతలు, పార్టీ కార్యకర్తలు, మిథున్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఇక, ఎంపీ మిథున్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ ను ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. ఈ సందర్భంగా రూ. 2 లక్షలతో రెండు ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే, వారంలో రెండుసార్లు స్థానిక పోలీస్ స్టేషన్ లో సంతకాలు చేయాలని పేర్కొనింది.