Minor Rape Case: చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఈ నెల 25వ తేదీన చిత్తూరులోని నగరవనం పార్కుకు వెళ్లిన ప్రేమ జంటను ముగ్గురు దుండగులు అడ్డుకున్నారు. మొదట విలువైన వస్తువులను దోచుకుని, అనంతరం ప్రియుడిని బంధించి, అక్కడ ఉన్న మైనర్ బాలికపై ఒకరి తరువాత మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక, నిందితులైన మురకంబట్టుకు చెందిన మహేష్, కిషోర్, సంతపేటకు చెందిన హేమంత్ ప్రసాద్ పై పోక్సో కేసుతో పాటు SC,ST కేసు నమోదు అయిందని డీఎస్పీ సాయినాథ్ వెల్లడించారు.
Read Also: 1020 Movies Hacked: ఇదేం కిక్ రా స్వామీ.. కిక్ కోసం ఇంత పని చేస్తావా బాబు?
అయితే, ఈ వ్యవహారం కాస్త రాజకీయ రంగు పులుముకుంది. అత్యాచారానికి పాల్పడిన నిందితులు మీ పార్టీకి చెందిన వారంటే కాదు మీ పార్టీకి చెందిన వారంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కాగా, నిందితులు ముగ్గురు కూడా గత ఐదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే స్థానిక వైసీపీ నేత విజయానంద రెడ్డి దగ్గర పని చేసే వారని దానికి సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. ఇక, టీడీపీకి కౌంటర్ గా గత నెల 25వ తేదీన అధికారికంగా నిందితులు ముగ్గురు టీడీపీలో చేరారని చిత్తూరు ఎమ్మెల్యే స్వయంగా కండువా చేసి పార్టీలో ఆహ్వానించిన వీడియోలను ఫోటోలను వైసీపీ ఇంఛార్జ్ విజయ నంద రెడ్డి రిలీజ్ చేశారు. ఇలా ఓవైపు అత్యాచార ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతుంటే మరోవైపు రాజకీయంగాను ఈ అంశం తీవ్ర దుమారం రేపుతుంది.