IIT Madras : ఐఐటి మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు
- ఐఐటి మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు
- అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడమే లక్ష్యం
- మంత్రి నారా లోకేష్ సమక్షంలో 8 విభాగాల ఒప్పందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IIT Madras : సామాజిక సంబంధిత కార్యకలాపాల్లో ఏపి ప్రభుత్వంతో కలసి పనిచేయాలని ఐఐటి మద్రాసు నిర్ణయించింది. ఐఐటిఎం ప్రతినిధులతో ఈరోజు ఉదయం సీఎం చంద్రబాబు సమక్షంలో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. సాయంత్రం మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఐఐటి మద్రాసు, ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల నడుమ కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాలు అమరావతిని ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేయడం, పరిశోధన, శిక్షణ, సాంకేతికతలో రాష్ట్రం ముందుకు పోవడానికి దోహదం చేస్తాయి.
1. ఐఐటీ-ఏపీ సీఆర్డీయే ఒప్పందం
అమరావతిలో డీప్ టెక్ పరిశోధన, డిజైన్, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ పార్క్‌ను ఏర్పాటు చేయడానికి సాంకేతిక సలహాలను అందించేందుకు ఈ ఒప్పందం కుదిరింది. ఐఐటీ మద్రాస్, ఏపీ ప్రభుత్వం కలిసి ఫిజికల్ , వర్చువల్ పద్ధతుల్లో ఈ ప్రాజెక్టులో పని చేస్తుంది.
Also Read
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
2. ఐఐటీ-ఏపీ మారిటైమ్ బోర్డు ఒప్పందం
సముద్ర పరిశోధన, కోస్టల్ ఎనర్జీ హార్వెస్టింగ్ టెక్నాలజీలు, కమ్యూనికేషన్ పరిష్కారాలను అభివృద్ధి చేయడంపై ఈ ఒప్పందం ఫోకస్ చేయగా, సముద్ర పరిశోధనతో పాటు విద్య, శిక్షణ, కన్సల్టెన్సీ సేవలు అందించే ఉద్దేశం కూడా ఉంది.
3. ఐఐటీ-ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ఒప్పందం
స్వయం ప్లస్, ఐఐటీ ప్రవర్తక్ డిజిటల్ స్కిల్ అకాడమీ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా స్కేల్ స్కిల్లింగ్ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నాణ్యత పెంచే ఈ ఒప్పందం ప్రధానంగా యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు సంకల్పించబడింది.
4. ఐఐటీ-ఏపీ విద్యాశాఖ ఒప్పందం
పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక శిక్షణ అందించే ఈ ఒప్పందం ద్వారా ఐఐటీ మద్రాస్, ఏపీ ప్రభుత్వంతో కలిసి ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆధునిక శిక్షణ కార్యక్రమాలు అందించనుంది.
5. ఐఐటీ-ఇన్వెస్టిమెంట్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ శాఖ ఒప్పందం
కుప్పం, పుట్టపర్తి విమానాశ్రయాలను లాజిస్టిక్స్ హబ్‌గా అభివృద్ధి చేయడం, వ్యాపార అవకాశాలు సృష్టించడం వంటి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే ఒప్పందం.
6. ఐఐటీ-ఐటీ శాఖ ఒప్పందం
విశాఖపట్నం నగరాన్ని ఇంటర్నెట్ గేట్‌వేగా అభివృద్ధి చేయడానికి, రాష్ట్రంలో డేటా కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఐఐటీ మద్రాస్, ఏపీ ఐటీ శాఖ మధ్య ఒప్పందం కుదిరింది.
7. ఐఐటీ-ఆర్టీజీఎస్ శాఖ ఒప్పందం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి రంగాల్లో సాఫ్ట్‌వేర్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.
8. ఐఐటీ-క్రీడల శాఖ ఒప్పందం
అమరావతిలో ఒక ఇంటర్నేషనల్ స్థాయి స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయడంపై ఐఐటీ మద్రాస్ సాంకేతిక సలహాలను అందించే ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాలు అమరావతిని అభివృద్ధి చేయడంలో, సాంకేతికత, పరిశోధన, విద్య, క్రీడల, సముద్ర పరిశోధన వంటి రంగాల్లో కీలక ప్రగతిని చేర్చగలవు.
Seethakka: స్వయం సహాయక సంఘాలకు మంత్రి సీతక్క గుడ్‌న్యూస్..
తాజావార్తలు
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!