ఏపీలో ఎండలు దంచి కొడుతున్నాయి. జనం ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి. ముఖ్యంగా ఉదయం పదిగంటలు దాటిన తర్వాత భానుడి భగభగలకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడుగా.. తీవ్రమైన వడగాల్పులు కూడా వీస్తాయని తెలిపింది. ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రేపు (సోమవారం) 72 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 200 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల…
Texas Road Accident: అమెరికాలోని టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు భారతీయులు దుర్మరణం చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమారు దగ్గరి బంధువులుగా తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే సతీష్ బాబాయి నాగేశ్వరరావు. ఆయన భార్య, కూమార్తె, ఇద్దరు చిన్నారులు మరణించారు. ఎమ్మెల్యే సతీష్ బాబు చిన్నాన్న కూమర్తె నవీన గంగ, అల్లుడు లోకేష్ తమ ఇద్దరు పిల్లలు టెక్సాస్‌లో…