Janasena: స్పష్టం చేసిన పవన్ కల్యాణ్.. నిరసనలకు జనసేన దూరం..!
- తిరుపతిలో నిరసనలకు దూరంగా జనసేన..
- జగన్ డిక్లరేషన్ టీటీడీ చూసుకొనే ప్రక్రియేనన్న పవన్..
- జగన్ విషయంలో ఆయన మతాన్ని.. పర్యటనను లక్ష్యంగా చేసుకోవద్దని సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janasena: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తిరుమల పర్యటన కాకరేపుతోంది.. తిరుమల లడ్డూ వివాదం ముదురుతోన్న వేళ.. ఆయన తిరుమల పర్యటన ఉత్కంఠగా మారింది.. అయితే, జగన్ డిక్లరేషన్ ఇచ్చే శ్రీవారిని దర్శించుకోవాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నాయి.. ముఖ్యంగా బీజేపీ, హిందూ సంఘాలు.. వైఎస్ జగన్ తిరుమల పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి.. మరోవైపు.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో తిరుపతిలో నిరసనలకు దూరంగా ఉండాలని జనసేన పార్టీ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.. వైఎస్ జగన్ తిరుమల యాత్రలో డిక్లరేషన్ అనేది టీటీడీ చూసుకొనే ప్రక్రియ.. జగన్ విషయంలో ఆయన మతాన్ని, ఆయన పర్యటనను లక్ష్యంగా చేసుకొని మాట్లాడాల్సిన సమయం కాదిది. వ్యక్తులను, అన్య మతాలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడవద్దు.. ఆ ప్రక్రియపై కూటమి పక్షాలు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.. ఇక, అధినేత వ్యాఖ్యల నేపథ్యంలో వైఎస్ జగన్ పర్యటన, డిక్లరేషన్ ఆంశాలకు దూరంగా ఉన్నారు జనసేన నేతలు…
Read Also: Pakistan : తన బిడ్డను వెనక్కి ఇవ్వాలని.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పాకిస్తాన్ బ్రిటీష్ పౌరుడు
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
కాగా, వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఉత్కంఠ రేపుతోంది. శ్రీవారి దర్శనార్థం సాయంత్రం నాలుగు గంటల 50 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారాయన. అనంతరం రోడ్డు మార్గాన తిరుమల పయనమవుతారు. రాత్రి 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. రేపు ఉదయం పదిన్నరకు శ్రీవారిని దర్శించుకోనున్నారు. జగన్ కు ఘన స్వాగతం పలకడానికి వైసీపీ శ్రేణులు సిద్దమవుతున్నారు. అయితే జగన్ డిక్లరేషన్ ఇచ్చాకే వెళ్లాలని.. లేదంటే అలిపిరి వద్దే అడ్డుకుంటామంటూ బీజేపీ, హిందు సంఘాల హెచ్చరించాయి. దీంతో భద్రతను భారీగా పెంచారు. అటు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తిరుపతికి చేరుకున్నారు పోలీసులు. జిల్లా వ్యాప్తంగా 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. జగన్ పర్యటనతో హిందూ పరిరక్షణ సమితి, కూటమినేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 లకు ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్‌లో మీటింగ్ జరగనుంది. సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనేదానిపై ఉత్కంఠగా మారింది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?