ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీ మోతలు ఉండవని హామీ ఇస్తున్నాం అన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్ - సూపర్ హిట్ సభలో ఆయన మాట్లాడుతూ.. శివతాండవాన్ని వినిపించిన నేల ఇది.. ఎందరో కవులు, కళాకారులు పుట్టిన నేల ఇది.. సీమకు ఎప్పుడూ కరువు కాలం, ఎండా కాలమే.. దీన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు..
సైబర్ నేరగాళ్లు అమాయకులనే కాదు ఉద్యోగులను, విద్యావంతులను కూడా బురిడికొట్టిస్తున్నారు. తాజాగా అనంతపురంలో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. సైబర్ నేరగాళ్ల వలకి చిక్కాడు రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి. సీఐడీ అధికారి అంటూ బెదిరించి రూ. 1.04 కోట్లు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. ఓబులదేవ నగర్ కి చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగికి మహిళలను వేదిస్తున్నావని, మనీలాండరింగ్ కి పాల్పడ్డావని సైబర్ నేరగాడు కాల్ చేశాడు. డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరించారు. Also Read:Harihara Veeramallu :…
నెల్లూరు జిల్లాలో అమోనియా లీక్ ఘటన కలకలం సృష్టించింది. టీపీ గూడూరు మండలం అనంతపురం గ్రామంలో అమోనియా లీకైంది. వాటర్‌బేస్ కంపెనీలో అమోనియా గ్యాస్ లీక్ కావడంతో.. ఊపిరాడక కార్మికులు హుటాహుటిన పరుగులు తీశారు. ఈ ఘటనలో 10 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. అనంతపురం చుట్టుపక్కల గ్రామాలకు సైతం అమోనియా గ్యాస్ భారీగా వ్యాపించింది. అమోనియా గ్యాస్ లీక్‌తో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ముందు జాగ్రత్తగా అందరూ మాస్కులు…
మంగళవారం అనంతపురం జిల్లాలో డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవడం కోసం హోంమంత్రి వంగలపూడి అనిత ఇప్పటికే అనంతపురం నగరానికి చేరుకున్నారు.
నేడు అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. రాప్తాడులో జరిగే 'సిద్ధం' బహిరంగ సభకు సీఎం జగన్ హాజరుకానున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లి తన నివాసం నుంచి బయల్దేరి ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది వైసీపీ శ్రేణులు భారీగా తరలిరానున్నారు. మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.
Andhra Pradesh: అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామంలో మాజీ మంత్రి పరిటాల సునీత ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ వైసీపీ కార్యకర్త మాజీ మంత్రి పరిటాల సునీత కాళ్లపై పడి క్షమించాలంటూ వేడుకున్నాడు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరి తప్పు చేశానంటూ వైసీపీ కార్యకర్త ముచ్చుమర్రి రామాంజనేయులు అభిప్రాయపడ్డాడు. Read Also: Twitter Data Leak:…
YSRCP: అనంతపురం జిల్లాలో వైసీపీ కీలక నేత కాపు రామచంద్రారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు కాపు రామచంద్రారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు వైసీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం జగన్‌కు లేఖ రాశారు. తమ కుటుంబంలో ఇటీవల జరిగిన విషాద సంఘటనతో పాటు నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నందున తాను జిల్లా అధ్యక్ష పదవిని నిర్వహించలేకపోతున్నట్లు లేఖలో కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. తనకు జిల్లా అధ్యక్ష…