Anathapuram Priest: సమాజంలోని గౌరవప్రదమైన వృత్తుల్లో అర్చకత్వం కూడా ఒకటి. అర్చకులు, పురోహితులకు సమాజంలో మంచి గౌరవం ఉంటుంది. భక్తులు ఆలయానికి వెళ్లి అర్చకుడితో పూజలు చేయించుకుని ఆయన కాళ్లకు మొక్కుతారు. అయితే కొందరు అర్చకత్వం ముసుగులో ఆ వృత్తి విలువలకు కళంకం తెస్తున్నారు. తులసి వనంలో గంజాయి మొక్కల తరహాలో ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిలో అనంతపురం జిల్లాకు చెందిన అనంత శయన అనే పూజారి ఉన్నాడు. ఆలయానికి పూజల కోసం వచ్చే యువతులను టార్గెట్ చేయడమే…
ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు, గ్యాస్ ధరలను నిరసిస్తూ అనంతపురంలో వామపక్షాల నేతలు నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం ఏపీ సెక్రటేరియట్ ముట్టడికి వామపక్షాల నేతలు పిలుపునిచ్చారు. దీంతో సీపీఎం, సీపీఐ కార్యకర్తలు పోరు గర్జనకు వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. అటు సీపీఐ ఆధ్వర్యంలో విజయవాడలో తలపెట్టిన పోరుగర్జన కార్యక్రమానికి వెళ్తున్న రామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అనంతపురంలో వామపక్షాల నిరసన ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, ఆందోళన కారుల మధ్య తోపులాట…
అనంతపురం జిల్లాలో దళితుడి ఇల్లు కూల్చివేతను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుడి ఇల్లు కూల్చి ప్రభుత్వం ఏం సాధించిందని ప్రశ్నించారు. పేదవాడి ఇల్లు కూల్చివేతకు అంత మంది అధికారులు యుద్ధం చేస్తారా అంటూ నిలదీశారు. ఒక సామాన్య దళిత వ్యక్తి ఇంటిని కూల్చి కుటుంబాన్ని రోడ్డున పడేసేందుకు ఎమ్మెల్యే, ఆర్డీవో, పోలీసులు అధికారుల వరకు అంతా కలిసి యుద్దం చేయడంపై మండిపడ్డారు. అసలు జగన్ ప్రభుత్వానికి కూల్చడం తప్ప నిర్మించడం…
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఆలూరు రంగనాథ స్వామి తిరునాళ్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తిరునాళ్లకు వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఒకే సమయంలో వచ్చారు. అయితే ఈ విషయాన్ని గమనించిన పోలీసులు జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఆపి కాసే ఆగి వెళ్లాలని సూచించారు. పెద్దారెడ్డి వెళ్లిపోయిన తర్వాత జేసీని అనుమతిస్తామని పోలీసులు వెల్లడించారు. దీంతో పోలీసుతో జేసీ వాగ్వాదానికి దిగారు. పోలీసులు తనను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.…
అనంతపురం టీడీపీలో టీజింగ్ రాజకీయం కొనసాగుతోంది. పార్టీ సీనియర్లపై వాళ్లముందే సెటైర్లు వేసిన JC ప్రభాకర్‌రెడ్డి… ఇప్పుడు ఏకంగా నియోజకవర్గ పర్యటనలు మొదలుపెట్టారు. ఈ నియోజకవర్గాలన్నీ JCని వ్యతిరేకించే నేతలవి కావడంతో… పార్టీలో ఇది ఇంకేం సమస్యకు కారణం అవుతుందోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీకి మీరే నష్టమని అనంత టీడీపీ నేతలపై జేసీ ఫైర్..! కార్యకర్తలను నాయకులను పట్టించుకోవడం లేదు. వైసీపీ నేతలతో కొంతమంది మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారు అంటూ అనంతపురం టీడీపీ నేతల సమావేశంలో…
భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త.. పరాయి పురుషులతో మాట్లాడనని హామీ పత్రం రాసివ్వాలని కత్తితో దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో చోటుచేసుకొంది. రజాక్ అనే వ్యక్తికి అనంతపురం పట్టణానికి చెందిన షర్మిలతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. కొన్నాళ్లుగా రజాక్ భార్య షర్మిలపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె పరాయి పురుషులతో మాట్లాడడం సహించలేకపోయాడు. తరచూ ఆమెతో గొడవ పడ్డాడు. దీనిపై ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కోపంలో కత్తితో ఆమెపై దాడికి…