ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) రియాక్షన్ మొదలయింది. డ్యూటీలో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులపై చర్యలకు ఆదేశించింది. ఇవాళ మధ్యాహ్నం ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీలు ఇచ్చిన రిపోర్ట్‌ను ఆధారంగా చేసుకొని చర్యలు చేపట్టింది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలను సస్పెన్షన్ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.
Ex MLA Prabhakar Chowdary on Chandrababu Naidu: తనకు పార్టీ మారే ఆలోచన లేదని, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నేతృత్వంలో పని చేయాలని ఉందని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తెలిపారు. అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్ విషయంలో చంద్రబాబు పునరాలోచించుకోవాలన్నారు. కార్యకర్తలు ఓకే అంటే మాత్రం తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రభాకర్ చౌదరి చెప్పారు. దగ్గుపాటి ప్రసాద్‌కు సహకరించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. Also Read: Top Headlines…
అనంతపురం జిల్లాలోని టీడీపీ సీనియర్లలో టికెట్ టెన్షన్ నెలకొంది. సీనియర్లు, జూనియర్లు లేరని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సీట్ల కేటాయింపునకు సర్వేలే కీలకం అని చెప్పుకొచ్చారు. త్యాగాలకు సిద్దంగా ఉండాలని సూచన చేసినట్లు సమాచారం.
వైసీపీలో నియోజకవర్గ ఇంఛార్జుల మార్పుల- చేర్పుల కసరత్తులు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లాలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి నేతలు క్యూ కడుతున్నారు. వైసీపీ అధిష్టానంతో నేతల వరుస భేటీలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి కొడాలి నాని, ఎంపీ గోరంట్ల మాధవ్ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. మచిలీపట్నంలో పోటీపై పేర్నినానితో సీఎం చర్చించారు. అలాగే హిందూపురం ఎంపీ సీటు మాధవ్ కు దక్కుతుందా లేదా అనేది అనుమానమే.. మరోవైపు సీఎం…