అనంతపురం జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన వాటిపై చర్చించామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అనంతపురంలో 14 టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించిన జిల్లా ప్రజల రుణం తీర్చుకునేలా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేసేలా నిర్ణయం తీసుకున్నాం అని మంత్రి పయ్యావుల చెప్పారు. నేడు జరిగిన టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.…