Anant Ambani-Radhika Merchant: అపర కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా కొనసాగింది. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, తన ప్రేయసి రాధిక మర్చంట్ తో వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. అత్యంత ఘనంగా నిర్వహించిన ఈ పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, అతిథుల ఆశీర్వాదాల మధ్య అనంత్, రాధిక దండలు మార్చుకున్నారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వరుడు తల్లిదండ్రులు, వధువు తల్లిదండ్రులు అనంత్ సోదరి ఇషా అంబానీ పిరమల్, అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతో పాటు వధువు సోదరి అంజలి మర్చంట్ మజిథియా తదితరు సన్నిహిత కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. బాలీవుడ్, టాలీవుడ్, క్రీడా రంగ ప్రముఖులు, దేశ విదేశాలకు చెందిన పలువురు అతిథులు ఈ పెళ్లి వేడుకకు హాజరై మరింత ఆనందోత్సాహాలను జోడించారు.
Read Also: Drink Own Urine: ఇదేం ఖర్మ రా నాయనా.. తన మూత్రం తనే తాగుతున్న వ్యక్తి..
ఇక, ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ పెళ్లికి తారాలోకం దిగొచ్చింది. సెలబ్రిటీల సందడితో ముంబయి నగరం కలకలలాడింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య అనంత్- రాధిక ఒక్కటయ్యారు. ఆమెతో కలలుగన్న కోటను నిర్మించుకుంటానని కొత్త పెళ్లికుమారుడు ప్రామిస్ కూడా చేశారు. శ్రీకృష్ణుడి ఆశీర్వాదంతో ఇద్దరం కలిసి మనం కలలుకన్నట్టుగా మన ఇంటిని నిర్మించుకుందామని నీకు మాట ఇస్తున్నా.. మన ఇల్లు ఒక ప్రదేశం మాత్రమే కాదు.. మనం ఎక్కడున్నామన్న దానితో సంబంధం లేకుండా అది ప్రేమతో నిండి ఉంటుందని తన భార్య రాధికకు అనంత్ అంబానీ భరోసా ఇచ్చారు. ఇక, ఈరోజు (శనివారం) జరగనున్న శుభ్ ఆశీర్వాద్‌కు అతిథులంతా ఫార్మల్ దుస్తుల్లో వెళ్లనున్నారు. రేపు(ఆదివారం) రిసెప్షన్ జరగనుంది. ఇవన్నీ బాంద్రాలోని జియో వరల్డ్ సెంటర్‌లోనే కొనసాగనున్నాయి.