రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు అమ్మ ఒడి పథకం కింద ప్రతి ఏటా రూ.15 వేల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేస్తోంది.
ఏపీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బాలాజీ జిల్లాలో మంత్రి రోజా పర్యటిస్తున్నారు. వడమాలపేట మండలం ఎస్వీపురం గ్రామంలో మంగళవారం నాడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను మంత్రి రోజా వివరించారు. Varla Ramaiah: సజ్జల చేతుల్లో సీఐడీ పావుగా మారింది ఓ ఇంటి దగ్గర మంత్రి రోజా ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓ అమ్మాయిని…
ఏపీలో జగనన్న అమ్మఒడి, వాహన మిత్ర పథకాలు రద్దు అయినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ రెండు పథకాలను రద్దు చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. దయచేసి ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని ఫ్యాక్ట్‌చెక్ టీం విజ్ఞప్తి చేసింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల 2022 ఏడాదికి గాను ఈ రెండు పథకాలు రద్దు చేసినట్లు కొందరు ఫేక్ ప్రెస్‌నోట్ సృష్టించారని తెలిపింది. వాళ్లను గుర్తించామని, చట్టప్రకారం చర్యలు…
విద్యాశాఖపై గురువారం మధ్యాహ్నం క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా అమ్మ ఒడికి బదులుగా ల్యాప్ టాప్ ఆప్షన్‌ను 8.21 లక్షల మంది విద్యార్థులు ఎంచుకున్నారని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. నాడు-నేడులో భాగంగా ఇప్పటి వరకు 33వేల అదనపు తరగతులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. సుమారు 23,975 స్కూళ్లలో నాడు-నేడు రెండో దశ కింద పనులు జరుగుతున్నాయని.. నెల రోజుల్లోగా నూటికి నూరు శాతం రెండో దశ కింద చేపట్టనున్న అన్ని…
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై మండిపడ్డారు మంత్రి మేరుగ నాగార్జున. టీడీపీ అభిప్రాయాలని ఇతర మార్గాల ద్వారా చెప్పించారు. సంక్షేమ పథకాలు ఆగిపోవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఈ కుట్రలని గమనించాలని కోరుతున్నా. అంబేద్కర్, పూలే , పెరియార్ రామస్వామి ఆలోచనలు ఈ రోజు అమలవుతున్నాయి. చంద్రబాబుకి ఎవరైనా ఓటేస్తే ఈ పథకాలు ఆపేస్తామని చెప్పకనే చెప్పారు. జగనన్న అమ్మ ఒడి ద్వారా 44 లక్షలపైన తల్లులకి అమలు చేస్తున్నాం అన్నారు మంత్రి…
ఏపీలో అమలవుతున్న అమ్మ ఒడిపై ఎల్లో మీడియా, టీడీపీ నాయకులు తప్పుబడుతున్నారని మండిపడ్డారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఏపీ ప్రజలు జగన్ శాశ్వత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని నమ్ముతున్నారు. లోకేష్ బాబు ఆయన బాబు చంద్ర బాబు ఎన్నో పన్నాగాలు పన్నుతున్నారు.ఎల్లో మీడియా అమ్మ ఒడి పథకంపై నానా తప్పులు రాస్తుందన్నారు. తల్లిరొమ్ము పాలు తాగిన ఏ వ్యక్తి అమ్మ ఒడిని విమర్శించరు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకం తీసుకువచ్చింది. హైదరాబాద్ లో మంత్రి ఆదిమూలపు…
ఏపీలో అమ్మ ఒడి పథకం కింద రూ.15వేలను ప్రభుత్వం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే విద్యా సంవత్సరానికి చెందిన డబ్బులను జూన్ నెలలో జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ పథకం లబ్ధిదారులు తమ ఆధార్‌ను గ్రామ, వార్డు సచివాలయాల్లో బ్యాంక్ ఖాతాలకు లింక్ చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. చైల్డ్ ఇన్ఫో వెబ్‌సైట్‌లో అమ్మఒడికి సంబంధించి విద్యార్థుల తల్లి ఆధార్ నెంబర్‌కు లింక్ చేసిన బ్యాంక్ నెంబర్‌ను మాత్రమే నమోదు చేయాలని కీలక సూచన…
ఏపీ ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలల నిర్వహణ పట్ల వ్యవహరిస్తున్న తీరుకి నిరసనగా విద్యార్ధులు ఆందోళన బాట పట్టారు. ఎయిడెడ్ పాఠశాలల పైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. అనంతపురం నగరంలోని గిల్దాఫ్ ఎయిడెడ్ బాలికల పాఠశాలలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. స్కూల్ యాజమాన్యం బలవంతంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సంతకాలు చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అంతా పేద విద్యార్థులు పల్లెల నుంచి వచ్చి చదువుకుంటున్నామని,…
ఏపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం కింద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించేందుకు సిద్ధమైంది. 9నుంచి 12 తరగతుల మధ్య విద్యార్థులకు అమ్మఒడి పథకంలో ఇచ్చే డబ్బుకు బదులుగా ల్యాప్‌టాప్‌లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వేళ ఆన్‌లైన్ చదువులు పెరగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం పిల్లల చదువు కోసం ఆర్ధిక సహకారం కింద జగన్ సర్కార్ అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తోంది. నవ రత్నాల్లో భాగంగా ఈ పథకం అమలవుతోంది. అమ్మఒడి కింద అర్హులైన విద్యార్ధులకు ఏడాదికి…