ఏపీ విద్యార్థులకు శుభవార్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం కింద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించేందుకు సిద్ధమైంది. 9నుంచి 12 తరగతుల మధ్య విద్యార్థులకు అమ్మఒడి పథకంలో ఇచ్చే డబ్బుకు బదులుగా ల్యాప్‌టాప్‌లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వేళ ఆన్‌లైన్ చదువులు పెరగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం పిల్లల చదువు కోసం ఆర్ధిక సహకారం కింద జగన్ సర్కార్ అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తోంది. నవ రత్నాల్లో భాగంగా ఈ పథకం అమలవుతోంది. అమ్మఒడి కింద అర్హులైన విద్యార్ధులకు ఏడాదికి 15వేల రూపాలయ ఆర్దిక సహాయం చేస్తోంది. ఈ మొత్తం విద్యార్ధి తల్లి ఖాతాలో జమ చేస్తున్నారు. అయితే గత ఏడాది నుంచి కరోనా వల్ల ఆన్‌లైన్ చదువులకు ప్రాధాన్యత, ఆవశ్యకత ఏర్పడింది.
ఆన్ లైన్ విద్యా విధానాన్ని విద్యార్ధులు అందిపుచ్చుకుని మరింతగా ముందుకు వెళ్లాలంటే ల్యాప్‌టాప్‌లు, ఇంటర్‌నెట్ వంటి సదుపాయాలు కీలకం అని భావించిన ప్రభుత్వం అమ్మఒడి కింద ఇస్తున్న మొత్తాన్నే ల్యాప్ టాప్ రూపంలో ఇవ్వాలని నిర్ణయించింది. అమ్మఒడి పథకంలో భాగంగా 9 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థుల కోసం ల్యాప్ టాప్ లు అందించేందుకు సిద్ధమైంది. నగదు తీసుకోవాలా లేక ల్యాప్ టాప్ తీసుకోవాలా అన్న ఆప్షన్ విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకే వదిలేసింది. ల్యాప్ టాప్ కావాలని ఆప్షన్ ఎంచుకున్న వారికి ప్రభుత్వమే అందిస్తుంది. 9 నుంచి 12 వ తరగతి చదివే విద్యార్ధులకు ఈ ఆప్షన్ కింద ల్యాప్‌టాప్‌ను ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది.
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
అమ్మఒడి పథకం కింద డ్యుయెల్ కోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్ డిస్క్, 14 ఇంచుల స్క్రీన్, విండోస్ 10 ఎస్టీఎఫ్ మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఆఫీస్‌ల కాన్ఫిగరేషన్‌తో ల్యాప్‌టాప్‌లు అందించనున్నారు. ఈ ల్యాప్‌టాప్‌లకు మూడేళ్ల వారెంటీ ఉంటుంది. ల్యాప్‌టాప్‌లకు మెయిన్‌టెనెన్స్ సమస్యలు ఎదురైతే ఫిర్యాదు ఇచ్చిన వారంలోపు పరిష్కరించేలా సదరు కంపెనీకి ప్రభుత్వం షరతు విధించింది. ఏవైనా సమస్యలు తలెత్తితే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా విద్యార్ధులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇచ్చే యోచనలో ఉంది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లకు 60 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని 15వ ఆర్థిక సంఘానికి ప్రతిపాదనలు పంపించింది. ఇందులో కేంద్రం వాటాగా 36వేల 473 కోట్ల రూపాయలుగా ఉండనుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్రాలు భరించాలి. ఇందులో 2021-22 విద్యా సంవత్సరంలో 1.5 కోట్ల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలనేది కేంద్ర ప్రణాళిక.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్‌డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!