India Pakistan War: పహల్గామ్ ఉగ్రదాడి దాయాదుల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్తాన్ రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు మాత్రం మేము భారత్‌ని ధీటుగా ఎదుర్కొంటామని బీరాలు పలుకున్నారు. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు, ఎంత గంభీరంగా బయటకి కనిపిస్తున్నా, పాక్ నాయకత్వంలో భారత్ అంటే భయం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే, బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా వంటి సంక్షోభ ప్రాంతాల నుంచి…
India Pakistan Tension: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే, ఈ భారత్ తీసుకుంటున్న నిర్ణయాలతో పాకిస్తాన్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ అన్నారు. ప్రధాని మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే భయంతో పాకిస్తాన్ మంత్రులు, ఆర్మీ జనరల్స్ దేశం విడిచి పారిపోయేందుకు టిక్కెట్లు బుక్ చేసుకున్నారని ఆరోపించారు.
India-Pak tensions: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాకిస్తాన్ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ పరిస్థితి తీవ్రతను మరింత పెంచారు. భారత్ తమపై దాడికి సిద్ధమవుతుందని సాక్ష్యాత్తు ఆ దేశ మంత్రులే వ్యాఖ్యానించారు. ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పాక్ సైన్యం భారత సరిహద్దుల్లో మోహరించింది. మరోవైపు, పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) పై భారత్ దాడి చేస్తుందేమో అని పాక్ తెగ భయపడుతోంది. ఈ మేరకు ఇప్పటికే పీఓకేలోని…
MP Yusuf Pathan: ఒడిశా రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్ కి చెందిన వలస కార్మికులపై జరిగిన దాడిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బెర్హంపూర్ ఎంపీ, భారత మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
Supreme Court: పహల్గామ్ ఉగ్రవాదిలో 26 మంది టూరిస్టులు చనిపోయిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌పై దౌత్య చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇండియాలో ఉంటున్న పాకిస్తానీలు దేశం వదిలి వెళ్లిపోవాలని ఆదేశించింది. పాక్ జాతీయులు వీసాలను రద్దు చేసింది. అయితే, పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో జన్మించిన ఒక వ్యక్తిని, అతడి కుటుంబ సభ్యుల బహిష్కరణపై సుప్రీంకోర్టు ఉపశమనం కల్పించింది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. భారత్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేస్తుందో అని దాయాది దేశం భయపడి చస్తోంది. దీంతో, పాక్ సైన్యం అంతా హై అలర్ట్‌లో ఉంది. మరోవైపు, దాని భయాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ఆయనతో పాటు పాక్ సైన్యంలో ముఖ్యమైన జనరల్స్ తన ఫ్యామిలీలను లండన్, న్యూ…
Bilawal Bhutto: పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది టూరిస్టుల్ని టెర్రరిస్టులు హతమార్చారు. లష్కరే తోయిబాకు చెందిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది. అయితే, అప్పటి నుంచి భారత్ పాకిస్తాన్‌పై ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే, సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది.
Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌కి భయాందోళనలు పెరిగాయి. కాశ్మీర్ అందాలను చూస్తున్న అమాయకపు ప్రజలపై పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌పై, టెర్రరిజంపై కఠిన చర్యలు తీసుకోవాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా తొలిసారిగా ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై స్పందించారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ఉగ్రవాదులను ఎక్కడున్నా వెతికి వెతికి పట్టుకొని శిక్షిస్తామని చెప్పారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద చర్యలకు గట్టిగా సమాధానమిస్తున్నామని, ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పడం ఖాయమని అన్నారు.
Pakistan: పాకిస్తాన్ మరింత దిగువ స్థాయికి చేరుకుంటోంది. సొంత దేశ పౌరుల్ని కూడా సరిహద్దు దాటి రానివ్వడం లేదు. ఇండియా నుంచి స్వదేశమైన పాకిస్తాన్ వెళ్తున్న పౌరుల్ని రానీవ్వడం లేదు. దీంతో అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొంది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి పాకిస్తాన్ తన రీసీవింగ్ కౌంటర్లను మూసేసిందని భారత ఇమ్మిగ్రేషన్ అధికారులు ధ్రువీకరించారు. దీని ఫలితంగా చాలా మంది పాకిస్తాన్ జాతీయులు సరిహద్దుల్లో చిక్కుకుపోయారు. Read Also: Pahalgam…