మణిపూర్లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఢిల్లీలో నిర్వహించారు. రాష్ట్రంలో హింసాత్మక పరిస్థితులను సమీక్షించేందుకు అమిత్ షా ఈ సమావేశానికి పిలుపునిచ్చారు.
Manipur Violence: నెల రోజుల నుంచి మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. జాతుల మధ్య ఘర్షణ తీవ్ర హింసకు దారి తీసింది. సైన్యం, సీఆర్పీఎస్ బలగాలు రాష్ట్రంలో మోహరించినా పరిస్థితి చక్కబడటం లేదు.
Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం జమ్మూ కాశ్మీర్ లో తన రెండు రోజుల పర్యటనను ప్రారంభించారు. కాశ్మీర్లో డెవలప్మెంట్ గురించి ఆయన ప్రస్తావించారు. బీజేపీ సిద్ధాంతకర్త, భారతీయ జన సంఘం వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి నివాళులర్పించారు. సాంబాలో సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్సెస్ లాబొరేటరీకి శంకుస్థాపన చేసిన తర్వాత సాయంత్రం శ్రీనగర్కు వెళ్లి అక్కడ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించే వితస్తా ఫెస్టివల్లో పాల్గొని అనంతరం భద్రతా సమీక్షా సమావేశం…
Uddhav Thackeray: ప్రధాని నరేంద్ర మోడీపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యుబిటి) నేత ఉద్ధవ్ ఠాక్రే విరుచుకుపడ్డారు. ఆదివారం శివసేన వ్యవస్థాపక దినోత్సవానికి ఒక రోజు ముందు ముంబైలోని పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ప్రధాని మోడీపై ఫైర్ అయ్యారు.
Amit Shah: పంజాబ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వాన్నంగా మారుతున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. పంజాబ్ గురుదాస్ పూర్ పర్యటనలో ఉన్న ఆయన ఆప్ నేత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ను టార్గెట్ చేశారు. భగవంత్ మాన్ రాష్ట్రానికి సమయాన్ని కేటాయించడం లేదని, అరవింద్ కేజ్రీవాల్ దేశ పర్యటనలకు రాష్ట్రవిమానాన్ని తీసుకెళ్లడమే పనిగా పెట్టుకున్నాడని ఆదివారం అన్నారు. ఆయన ముఖ్యమంత్రా..? లేక పోలే కేజ్రీవాల్ పైలెటా..? అని ప్రశ్నించారు.
Amit Shah to Meet Rajamouli at His Residence: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది బీజేపీ. ఈ క్రమంలోనే ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులను కలుస్తున్నారు, తమ ప్రభుత్వ ఘనతలు చెప్పి తమకు అండగా నిలవాలని కోరుతున్నారు. అందులో భాగంగా ఆయన రాజమౌళితో భేటీ కానుండడం హాట్ టాపిక్ అవుతోంది. ముందుగా…
ఇటీవల విశాఖలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. అమిత్ షా చెప్పేంత వరకు జీవీఎల్ కు తెలియదా అంటూ మండిపడ్డారు. విశాఖలో భూదందా నిజంగా జరిగితే ఎందుకు అడగలేదన్నారు. ఎన్నికలు వస్తున్నాయనే అమిత్ షా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.