ఇరాన్ క్షిపణి దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయం పెరుగుతోంది. కాగా, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతపై అభివృద్ధి చెందిన దేశాల సమూహం జీ-7 అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ప్రస్తుత ఛైర్‌పర్సన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఈ సమావేశానికి పిలుపునిచ్చారు.
ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా బెంజమిన్ నెతన్యాహు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో నెతన్యాహు ఇజ్రాయెల్‌లో ఎక్కువకాలం ప్రధానిగా పని చేసిన వ్యక్తిగా పేరుగాంచారు.
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌లు సోమవారం ఇండోనేషియాలోని బాలిలో సమావేశమయ్యారు. అమెరికా, చైనా దేశాల మధ్య ఆర్థిక, భద్రతాపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
Soviet Union Last President Mikhail Gorbachev died: సోవియట్ యూనియన్ చివరి అధ్యక్షుడిగా ఉణన్న మికాయిల్ గోర్బచెవ్ తన 91వ ఏట మాస్కోలో మంగళవారం మరణించారు. దీర్ఘకాలిక సమస్యలతో పలు రోజుల నుంచి మాస్కో సెంట్రల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గోర్బచేవ్ 1985-91 మధ్య సోవియట్ రష్యాకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. సోవియట్ యూనియన్ పతనానికి కారణం అయిన వ్యక్తిగా కొంత మంది గొర్బచేవ్ ను నిందిస్తే.. ప్రచ్ఛన్న యుద్ధం ముగించిన వ్యక్తిగా పాశ్చాత్య దేశాలు…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచ దేశాధినేతల్లో మళ్లీ నంబర్ వన్‌గా నిలిచారు. భారత ప్రధాని మోడీని 75 శాతం మంది ప్రజలు ఆమోదిస్తున్నారని అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సర్వే సంస్థ వెల్లడించింది. ప్రపంచ నాయకుల్లో అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా మోడీనే ముందున్నారని స్పష్టం చేసింది.
Over 130 Indian-Americans At Key Posts In Biden Administration: అమెరికాలో కీలక స్థానాల్లో భారతీయ-అమెరికన్లకు పాతినిథ్యం వహిస్తున్నారు. జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత 130 కన్నా ఎక్కువ మంది ఇండో అమెరికన్లు కీలక స్థానాల్లో నియమించబడ్డారు. అన్నింటి కన్నా ముఖ్యంగా భారత సంతతి మహిళ కమలా హారిస్ వైస్ ప్రెసిడెంట్ వంటి కీలక స్థానంలో ఉన్నారు. అమెరికాలో ఒక శాతం జనాభా ఉన్న ఇండో అమెరికన్లకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా..…
ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులను యావత్తు ప్రపంచ దేశాలు చూస్తూనే ఉన్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై వార్ డిక్లర్ చేయకనే చేశారు. అయితే దీనిపై ప్రపంచ దేశాలు జోక్యం చేసుకోరాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎవరైనా ఉక్రెయిన్ వ్యవహారంలో తలదూర్చితే ఎక్కడివరకైనా పోయేందుకు సిద్ధంగా ఉన్నామంటూ పుతిన్ సంకేతాలు పంపారు. అయితే ఎప్పటినుంచో అగ్రరాజ్యం అమెరికా, రష్యాలకు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో అమెరికా ఎలాంటి…