Soviet Union Last President Mikhail Gorbachev died: సోవియట్ యూనియన్ చివరి అధ్యక్షుడిగా ఉణన్న మికాయిల్ గోర్బచెవ్ తన 91వ ఏట మాస్కోలో మంగళవారం మరణించారు. దీర్ఘకాలిక సమస్యలతో పలు రోజుల నుంచి మాస్కో సెంట్రల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గోర్బచేవ్ 1985-91 మధ్య సోవియట్ రష్యాకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. సోవియట్ యూనియన్ పతనానికి కారణం అయిన వ్యక్తిగా కొంత మంది గొర్బచేవ్ ను నిందిస్తే.. ప్రచ్ఛన్న యుద్ధం ముగించిన వ్యక్తిగా పాశ్చాత్య దేశాలు గోర్బచేవ్ ను కీర్తిస్తున్నాయి. ప్రస్తుతం అధ్యక్షుడు పుతిన్ తో గోర్బచేవ్ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
19985-91 మధ్య రష్యా-అమెరికా సంబంధాల కోసం కృషి చేసిన వ్యక్తిగా గోర్బచేవ్ ను భావిస్తారు. యూఎస్ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ తో చారిత్రాత్మక అణు ఆయుధ ఒప్పందంపై చర్చలు జరిపినందుకు 1990లో నోబెల్ శాంతి బహుమతిని గెలుపొందాడు. ఇదిలా ఉంటే రష్యా ప్రపంచంలోనే సూపర్ పవర్ కాకుండా మికాయిల్ గోర్భచేవ్ అడ్డుపడ్డాడని పలువురు రష్యన్లు విమర్శిస్తుంటారు. ఇదిలా ఉంటే పశ్చిమ దేశాలు, అమెరికాలు మాత్రం గోర్బచేవ్ గొప్ప రాజనీతిజ్ఞుడిగా కీర్తిస్తుంది. 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించుకున్న తరువాత, ఉక్రెయన్ పై దాడికి తరువాత.. అడపాదడపా రష్యా, అమెరికాతో సంబంధాలను సరిదిద్దుకోవాలని సూచించారు. 1996లో చివరి సారిగా మరోసారి రాజకీయాల్లోకి రావాలని అనుకున్నాడు. ఆ సమయంలో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గోర్భచేవ్ కు కేవలం 0.5 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
Read Also: Vijayasai Reddy: కాంగ్రెస్ పాదయాత్ర.. మృత్యువుకు ముందు తుదిశ్వాస
గోర్భచేవ్ మరణంపై ప్రపంచ నాయకులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో పాటు యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ గోర్బచేవ్ మరణంపై సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఐరాస చీఫ్ ఆంటోనియో గెటర్రెస్.. గోర్బచెవ్ చరిత్ర గమనాన్ని మార్చిన రాజనీతిజ్ఞుడుగా.. ప్రచ్ఛన్న యుద్ధం ముగింపుకు కృషి చేసిన వ్యక్తిగా కీర్తించాడు. ప్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మక్రాన్ శాంతి మనిషిగా అభివర్ణించారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గోర్బచేవ్ మరణానికి సంతాపాన్ని తెలియచేశారు. అద్భుతమైన నాయకుడిగా అభివర్ణించారు. అమెరికా అధ్యక్షడు రోనాల్డ్ రీగన్ తో కలిసి అణ్వాయుధాలు తగ్గించాడని కీర్తించాడు. రాజకీయ అణచివేతకు గురైన దేశంలో ప్రజాస్వామ్యానికి పునాది వేశాడని అన్నాడు. గోర్బచేవ్ యూఎస్ఎస్ఆర్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో అమెరికా సెనెట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీలో జైడెన్ ఓ సభ్యుడిగా పనిచేశారు.