Sangareddy: చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.3 కోట్లతో భార్యాభర్తలు పరార్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangareddy: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ రాఘవేంద్ర కాలనీలో భారీ చిట్టీ మోసం వెలుగులోకి వచ్చింది. స్థానిక మహిళలకు అధిక లాభాల ఆశ చూపి కోట్ల రూపాయలు వసూలు చేసిన దంపతులు రాత్రికి రాత్రే పరారవడంతో బాధితులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు.
స్థానికంగా శిరీష, సాంబశివరావు దంపతులు కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి కాలనీలోని పలువురు మహిళల నుంచి సుమారు రూ.3 కోట్ల వరకు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. శిరీష ‘సాయి గణేష్ టెక్స్ టైల్స్’ పేరుతో బట్టల దుకాణాన్ని నిర్వహిస్తూ.. అదే సమయంలో చిట్టీల వ్యాపారం కూడా సాగించినట్లు తెలుస్తోంది. స్థానికుల నమ్మకాన్ని సంపాదించి భారీ మొత్తంలో డబ్బులు సేకరించారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
బాధితుల కథనం ప్రకారం.. దంపతులు కాలనీలో ఉన్న తమ సొంత ఇంటిని అమ్మేసి, ఆ తర్వాత ఎవరికి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే పరారయ్యారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు.. తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దంపతుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతూ.. పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..