భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్బంగా టీఆర్ఎస్ వర్గీయుల మధ్య వివాదం చినికిచినికి గాలి వానలాగా మారుతోంది. పోలీసు అధికారులు అత్యుత్సహం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అశ్వాపురం మండలం మల్లెల మడుగులో పొంగులేటి అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ జరుపకుండా గ్రామంలో 144 సెక్షన్ విదించారు. ఈ సందర్బంగా పోలీసులతో ,రేగా వర్గీయులతో పొంగులేటి వర్గానికి మద్య ఘర్షణ జరిగింది. రాళ్ల దాడిలో పొంగులేటి వర్గీయులు గాయపడ్డారు. అయితే పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటుగా మాజీ…
ఒక్క విగ్రహావిష్కరణ అధికారపక్షం నేతల మధ్య వివాదానికి ఆజ్యం పోసింది. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్బంగా జరిగిన ఘర్షణ ఖమ్మం జిల్లాలో చినికి చినికి గాలి వానగా మారుతోంది. టీఆర్ఎస్ పార్టీలోని రెండు వర్గాలు బాహా బాహికి గత రాత్రి దిగగా.. ఆ దాడుల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో ద్రోహం చేసిన వ్యక్తి రేగా అంటూ మాజీ ఎంఎల్ఎ పాయం ఆరోపిస్తుండగా పొంగులేటి పార్టీ బయటకు వెళ్లి పర్యటనలు చేయాలని రేగా కాంతారావు అంటున్నాడు.…
విజయవాడలోని పీడబ్ల్యూ గ్రౌండ్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న ప్రదేశాన్ని మంత్రుల బృందం సోమవారం సందర్శించింది. మంత్రులు పినిపే విశ్వరూప్, వెల్లంపల్లి శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్ లతో పాటు అధికారులు స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రలు మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు నిధులను గ్రీన్ ఛానల్ లో పెడతాం అని సీఎం హామీ ఇచ్చారని, 12.5 అడుగుల మోడల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని వారు తెలిపారు. 25 అడుగుల నమూనా విగ్రహం త్వరలో పెడతామని,…
ఎన్టీఆర్ గార్డెన్స్‌లో త్వరలో 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్ డిగ్నిటీ హౌసింగ్ కాలనీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. “హైదరాబాద్‌లో, ఒకవైపు అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన 2BHK హౌసింగ్ సైట్‌లలో ఇదొకటి, కొత్త సెక్రటేరియట్‌ను నిర్మిస్తున్నారు. అంతేకాకుండా 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం త్వరలో రానుంది.” అని కేటీఆర్ వెల్లడించారు. ఖైరతాబాద్ వార్డులో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్…