Congress Senior Leader V Hanumantha Rao React on Telangana Secretariat Name
రాజ్యాంగ పితామహుడు డా.బీఆర్ అంబేద్కర్ పేరును నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ సెక్రటేరియట్ పెట్టనున్నట్లు తెలంగాణ ఫ్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే.. సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని పార్టీలకతీతంగా అందరూ స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా.. కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంత రావు మాట్లాడుతూ.. నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని, ఈ నిర్ణయం దేశానికి ఆదర్శమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. భవనానికి అంబేద్కర్ పేరు పెట్టడం దానికి అసెంబ్లీలో మీరు మద్దతు తెలపడం పట్ల నెను స్వాగతిస్తున్నానన్నారు. అయితే.. మరి నా అంబేద్కర్‌ని ఎప్పుడు విడుదల చేస్తావు కేసీఆర్ అంటూ ఆయన చురకలు అంటించారు. లాకప్ లో పెట్టిన అంబేద్కర్‌ను తీసి ఇస్తే అది నిజమైన భక్తి అవుతుందని, అంబేద్కర్‌ని ఇస్తే ఆ ప్లేస్లో ప్రతిష్టిస్తామన్నారు. అంబేద్కర్ ని లాకప్ లో పెట్టి సచివాలయానికి అంబేద్కర్ పేరు పెడితే అది న్యాయం అనిపించదని, లాకప్ లో ఉన్న అంబేద్కర్‌ను విడుదల చేసినప్పుడే అంబేద్కర్ వాది అవుతాడు కేసీఆర్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
అయితే.. 2019 ఏప్రిల్ 12న పంజాగుట్టలో వీహెచ్.. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే తర్వాతి రోజే దాన్ని ఎవరో కూల్చేశారు. దీంతో వీహెచ్ మళ్లీ ఒక విగ్రహాన్ని చేయించారు. దానికి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టారు. అయితే దాన్ని కూడా పట్టుకుపోయి తనపై కేసు పెట్టారని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.