విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేస్తున్న అంబేడ్కర్ స్మృతివనం, అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అంబేడ్కర్ స్మృతివనం నిర్మాణం చారిత్రాత్మకమైనదని.. ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని మంత్రులకు, అధికారులకు వివరించారు.
సామాజిక విప్లవానికి నిదర్శనమే విజయవాడలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణం అన్నారు మంత్రి మేరుగ నాగార్జున.. ఏపీ చరిత్రలో సామాజిక సమతుల్యత కోసం సీఎం వైఎస్ జగన్ ఈ నిర్మాణం చేస్తున్నారని తెలిపారు.. అంబేద్కర్ చరిత్ర ఈ నిర్మాణంలో తెలుస్తుందన్నారు. త్వరలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ప్రారంభిస్తాం అని వె�
BR Ambedkar’s Largest Statue Unveiled In America: భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అతిపెద్ద విగ్రహం అమెరికాలో ఆవిష్కరణకు సిద్ధంగా ఉంది. భారతదేశం వెలుపల అంబేద్కర్ యొక్క అతిపెద్ద విగ్రహం అమెరికాలోని మేరీల్యాండ్‌లో అక్టోబర్ 14న ఆవిష్కరించబడుతుంది. ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ పేరుతో 19 అడుగుల విగ్రహాన�
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని తొందరలోనే ప్రారంభిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రతి రోజు 500 మంది ఇక్కడ అంబేద్కర్ స్మృతివనం పనులు చేస్తున్నారు.. అంబేద్కర్ విగ్రహం ఇంతపెద్దది ఇదే.. 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ మెగా ప్రాజెక్టు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బ్రిటీష్ ఎంపీ వీరేంద్ర శర్మ అభినందించారు. హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.
పార్లమెంట్ కి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఐటి మినిస్టర్ కేటిఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట చౌరస్తాలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
అక్కడ పనులు ఆగిపోతే పనులు ప్రారంభించాలని బీజేపీ వార్నింగ్ ఇస్తేనే ఈ రోజు విగ్రహం పూర్తి అయ్యిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి బండి సంజయ్, బీజేపీ నేతలు నివాళులు అర్పించారు.
తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. నూతన భవనం దగ్గరకు వెళ్లి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.