వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్ గా అంబర్ కిషోర్ ఝా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అంబర్ కిషోర్ ఝా సాయంత్రం పోలీస్ గెస్ట్ హౌస్ చేరుకొని సాయుధ పోలీసులు వందనం స్వీకరించారు.