వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్ గా అంబర్ కిషోర్ ఝా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అంబర్ కిషోర్ ఝా సాయంత్రం పోలీస్ గెస్ట్ హౌస్ చేరుకొని సాయుధ పోలీసులు వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ కార్యాలయమునకు చేరుకొని నూతన పోలీస్ కమిషనర్ ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ ఉన్న క్రైమ్స్ డిసిపి దాసరి మురళీధర్ నుండి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా క్రైమ్స్ డిసిపి మురళీధర్ తో పాటు పోలీస్ కమిషనరేట్ కు చెందిన ఇతర పోలీస్ అధికారులు నూతన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాను. మర్యాదపూర్వకంగా కలుసుకోని పుష్పాగుచ్చాలను అందజేసి అభినందనలు తెలియజేసారు.
2009 ఐపిఎస్ బ్యాచ్కు చెందిన అంబర్ కిషోర్ ఝా మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎ.ఎస్పీగాను 2012 వరంగల్ ఓఎస్ , అదనపు ఎస్పీగా పనిచేయడంతో పాటు 2014లో వరంగల్ ఎస్పీగా పనిచేసి తెలంగాణ ఏర్పాటు: అనంతరం భద్రాద్రి కొత్తగూడెం తోలి ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అలాగే 2018లో హైదరాబాద్ సౌత్ జోన్ డిసిపిగాను ఇదే సంవత్సరంలో కేంద్ర సర్వీసుల్లో విధులు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి మాసం డిఐజీగా పదోన్నతి పొందిన అంబర్ కిషోర్ షా ఇటీవల రాచకొండ జాయింట్ సిపి నియమించబడ్డారు.