ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. వెబ్సైట్ ర్యాంకింగ్ సర్వీస్ అలెక్సా.కామ్‌ను షట్‌డౌన్ చేస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. వచ్చే ఏడాది మే నెల నుంచి దీనిని అమలు చేయనున్నట్లు తెలిపింది. అలెక్సా.కామ్ ద్వారా వెబ్సైట్ల స్టాటిస్టిక్స్, వాటి ర్యాంకులను అమెజాన్ అందిస్తోంది. అంతేకాకుండా ఎస్ఈవో రీసెర్చ్, అనాలిసిస్ టూల్స్ కూడా అందిస్తోంది. పెయిడ్ వెర్షన్ తీసుకుంటే పలు రకాల ఎస్ఈవో సర్వీసులను కూడా వినియోగదారులు పొందవచ్చు. Read Also: బాలినో భళా… మూడేళ్ల కాలంలో……
పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా..విశాఖ ఏజెన్సీలో గంజాయి అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. ఓ వైపు అధికారులు దాడులతో వేల కిలోల స్వాధీనం చేసుకుంటున్నారు. మరో వైపు స్మగ్లర్లు గంజాయి చేరవేతకు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకునేందుకు కరివేపాకు పొడి, హెర్బల్ పౌడర్ల పేరుతో అమెజాన్ పికప్ బాయ్స్ సహకారంతో విశాఖ కేంద్రంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ద్వారా ఆన్లైన్లో గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్నట్టు మధ్యప్రదేశ్ పోలీసులు గుర్తించారు. మనమంతా…
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “ఆచార్య”. కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ప్యాక్డ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ‘ఆచార్య’ ఇప్పుడు ప్రొడక్షన్ చివరి దశలో ఉన్నాడు. ఈ చిత్రం సామాజిక సంబంధిత కథాంశంతో కూడిన గ్రామీణ యాక్షన్ డ్రామాగా రూపొండుతోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. Read Also : సామ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… ఫస్ట్…
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇటీవల తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇటీవల అమెజాన్ వేదికగా గంజాయి అమ్మకాలు జోరుగా కొనసాగుతుండటంతో పలు విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు అమెజాన్‌ను మరో వివాదం చుట్టుకుంది. దీంతో అమెజాన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే… మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అనారోగ్యంతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలుడు అమెజాన్ ద్వారా విషం (సల్ఫాస్ ట్యాబ్లెట్లు) కొనుగోలు చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు…
ప్రముఖ నటుడు సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం విడుదలైనప్పటి నుండి వివాదంలో ఉంది. ఈ సినిమా ద్వారా వన్నియార్ సంఘం పరువు తీసే ప్రయత్నం చేశారని, సదరు వర్గాన్ని కించపరిచారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ వివాదం రోజురోజుకీ ముదురుతోంది తప్ప ఇంకా చల్లారడం లేదు. తాజాగా #SuriyaHatesVanniyars అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. దీని ద్వారా వన్నియార్ వర్గం ప్రజలు సూర్యపై తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. సూర్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ…
గంజాయి, డ్రగ్స్ విక్రయాలు ఆందోళన కలిగిస్తున్నాయి.. వాటి సరఫరాకు ఉన్న ఏ అవకాశాన్ని వదలడం లేదు కేటు గాళ్లు.. లారీలు, కార్లు, ఆటోలు, టూ విలర్, చివరకు విమానాల్లో కూడా మత్తు పదార్థాలు పెద్ద ఎత్తున పట్టుబడుతూనే ఉన్నాయి.. కేజీలు, క్విటాళ్ల కొద్ది గంజాయి దొరికిన సందర్భాలు లేకపోలేదు. అయితే, స్మగ్లర్లు రూట్ మార్చారు.. ఆధునిక యుగంలో అంతా ఆన్లైన్ అయిపోయింది.. ఏ వస్తువు కావాలన్నా ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫారమ్స్ను ఆశ్రయిస్తున్నారు వినియోగదారులు. ఇప్పుడు గంజాయి విక్రయాలు…
ఆన్లైన్ షాపింగ్ రంగం అభివృద్ది చెందిన తరువాత చిన్న చిన్న వాటిని కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. ఆన్లైన్లో ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి వచ్చిందని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో వాటిపై ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సంఘటన ఒకటి ఇటీవల జరిగింది. కేరళకు చెందిన మిథున్ బాబు అనే వ్యక్తి పాస్‌పోర్ట్ కవర్‌ను ఆన్లైన్లో బుక్ చేశాడు. బుక్ చేసిన కవర్ ఇంటికి వచ్చింది. పార్శిల్ కవర్‌ను ఒపెన్ చేసి చూసి మిథున్…
అమెరికాలోని ఒక్లహామా రాష్ట్రానికి చెందిన ఓ మహిళ అమెజాన్‌లో ఓ వస్తువును కొనుగోలు చేసింది. అమెజాన్‌లో కొనుగోలు చేసిన వస్తువును డోర్ డెలివరీ చేసేందుకు డెలివరీ విమెన్ ఇంటికి వచ్చింది. ఈ లోగా కస్టమర్ నుంచి ఆమెకు ఓ మెసేజ్ వచ్చింది. భర్తకు తెలియకుండా ప్యాకేజీని దాచిపెట్టాలని మెసేజ్ వచ్చింది. మొదట ఇంటి గుమ్మం ముందు పార్శిల్‌ను ఉంచింది. ఆ తరువాత అక్కడి నుంచి తీసి దానిని ఇంటి బయట ఉన్న చెట్టుపొదల్లో దాచింది. దానిని ఫొటోగా…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు టాలీవుడ్ లోను అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన సినిమాలు తమిళ్, తెలుగులోను విడుదల అవుతాయి. ఇక ఇటీవల ఆకాశం నీ హద్దురా చిత్రం అమెజాన్ లో విడుదలై బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే. కరోనా సమయంలో అన్ని చిత్రాలు ఓటిటీ బాట పట్టిన విషయం తెల్సిందే. అందులో సూర్య- జ్యోతిక నిర్మించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే జ్యోతిక నటించిన రక్త సంబంధం అమెజాన్ లో విడుదలై మెప్పించింది.…
అమెజాన్ ప్రైమ్ తమ యూజర్లకు బ్యాడ్‌న్యూస్ అందించింది. కొత్త సినిమాలను, వెబ్ సిరీస్‌లను అందించే అమెజాన్ ప్రైమ్ ఇకపై ప్రియం కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వార్షిక సబ్స్క్రిప్షన్ ధరలు 50 శాతం పెరగనున్నాయి. దీంతో ఇప్పటివరకు వార్షిక ఫీజు రూ.999 చెల్లిస్తే సరిపోయేది. అయితే ఇకపై రూ.1,499 చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు నెలవారీ, మూడు నెలల ప్లాన్లను కూడా అమెజాన్ ప్రైమ్ పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెలవారీ ప్లాన్ రూ.129 ఉండగా ఇకపై రూ.179 చెల్లించాలి.…