Satellite Internet: దేశంలో మరో కొత్త టెక్నాలజీ.. శాటిలైట్ ఇంటర్నెట్‌తో కేబుళ్లు అవసరం లేదండోయ్..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amazon Satellite internet services in india: దేశంలో మరో టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం దేశంలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సాధారణంగా మారిపోయింది. ఇంటర్నెట్ లేని ఇల్లు అనేది కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ మన దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసును అమల్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సుమారు రూ. 80 వేల కోట్ల వ్యయంతో మొత్తంగా 3,236 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపి వాటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సర్వీసులు అందించేందుకు 2020లోనే ఈ ప్రాజెక్టును చేపట్టింది. అయితే ఇండియాలో మాత్రం అమెజాన్ సర్వీసులు అందుబాటులోకి రాలేదు.
Read Also: African Swine Fever: కేరళలో మరో వైరస్ కలకలం.. పందులను చంపేయాలని ఆదేశం
Also Read
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
ఇండియాలో లైసెన్సింగ్, ఇతర ప్రక్రియలు పూర్తయితే త్వరలోనే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అమెజాన్ వర్గాలు తెలిపాయి. ఇండియాలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల విస్తరణ కోసం లైసెన్సుల ప్రక్రియ, ఇతర అంశాలను చూసుకోగల సామర్థ్యమున్న వ్యక్తి అవసరమని.. అమెజాన్ బిజినెస్ డెవలప్ మెంట్ వ్యూహాన్ని సదరు వ్యక్తి ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుందని అమెజాన్ అభిప్రాయపడింది. కాగా శాటిలైట్ ఇంటర్పెట్‌తో ఎలాంటి కేబుళ్లకు అవసరం ఉండదు. అడవులు, మారుమూల ప్రాంతాలు, ఎటువంటి సదుపాయాలు లేని చోట్ల కూడా నేరుగా శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు. భూమిపై తక్కువ ఎత్తులోని కక్ష్యలో అమెజాన్ ఉపగ్రహాలు తిరుగుతూ ఇంటర్నెట్ సేవలు అందిస్తాయి. ఈ ఉపగ్రహాలను ప్రయోగించేందుకు అమెజాన్ ఇప్పటికే ఏరియాన్ స్పేస్, బ్లూ ఆరిజిన్, యునైటెడ్ లాంచ్ అలయన్స్ వంటి స్పేస్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.
తాజావార్తలు
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!