ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ డీలర్ల ఆందోళనకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.. సమస్యను పరిష్కరిస్తామన్న మంత్రి కొడాలి నాని హామీతో వెనక్కు తగ్గారు రేషన్ డీలర్లు.. నవంబర్ కోటా రేషన్‌కు ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తామని రేషన్ డీలర్ల అసోసియేషన్ ప్రకటించింది. కాగా.. జీవో నంబర్ 10 రద్దుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలంటూ రేషన్ డీలర్లు ఆందోళన చేస్తూ వచ్చారు.. సీఎం జగన్ తమ సమస్యలపై స్పందించేంత వరకు నిరసనలు కొనసాగుతాయని ప్రకటించారు.. Read Also : బీజేపీకి…
ఏపీ రాజధానిగా అమరావతిని పరిరక్షించాలంటూ ఆ ప్రాంత రైతులు ఎన్నో రోజులుగా దీక్షలు చేస్తూనే ఉన్నారు. అయినా వైసీపీ ప్రభుత్వంలో చలనం రాకపోవడంతో నవంబర్ 1 నుంచి మహాపాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ పాదయాత్ర రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు నుంచి చిత్తూరు జిల్లాలోని తిరుమల వరకు 45 రోజుల పాటు కొనసాగనుంది. నవంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న రైతుల మహాపాదయాత్ర డిసెంబర్ 17వ తేదీతో ముగియనుంది. Read Also: టీడీపీ ఎంపీ కేశినేని నాని…
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రేరేపిత టెర్రరిజం ఉంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా పార్టీ కార్యాలయంలో 36 గంటల దీక్షకు దిగిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.. టీడీపీ కార్యకర్తలని భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశ్యంతో దాడులు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల ప్రాణాలకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత డీజీపీదే.. ఫిర్యాదు చేద్దామని డీజీపీకి ఫోన్లు చేస్తే స్పందించలేదని.. దీంతో గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం అన్నారు..…
టీడీపీ అధినేత చంద్రబాబు నిరసన దీక్ష ప్రారంభమైంది.. టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు.. రాష్ట్రంలోని పలు కార్యాలయాలపై దాడికి నిరసనగా.. ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరుతో దీక్షకు దిగారు చంద్రబాబు.. 36 గంటల పాటు ఈ దీక్ష కొనసాగనుంది.. ఇక, దాడిపై నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ చీఫ్.. పగిలిన అద్దాలు, ధ్వంసమైన ఫర్నిచర్ మధ్యలోనే వేదికను ఏర్పాటు చేశారు. వేదికపై ఏపీ టీడీపీ అధ్యక్శుడు అచ్చెన్నాయుడు, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నర్శింహులు.. పార్టీ సీనియర్…
మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు.. వివిధ జిల్లాల్లోని పార్టీ కార్యాలయాలపై దాడికి నిరసనగా.. కాసేపట్లో దీక్షకు కూర్చోనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న దీక్ష.. రేపు రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది… టీడీపీ కార్యాలయంలోనే 36 గంటల పాటు దీక్ష కొనసాగించనున్నారు పార్టీ అధినేత.. మరోవైపు.. చంద్రబాబు దీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశారు తమ్ముళ్లు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల దాడిలో పగిలిన అద్దాలు, ధ్వంసమైన…
ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. రాష్ట్రంలోని వివిధ థర్మల్ కేంద్రాల నుంచి కరెంటు ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై ఆరా తీశారు.. థర్మల్ కేంద్రాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఏపీ సీఎం.. దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నా వాటిని తెప్పించుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించిన ఆయన.. కావాల్సిన బొగ్గు కొనుగోలు చేయాలని, ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టం…
కరోనా మహమ్మారి కట్టడి కోసం కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూ లాంటి ఆంక్షలు విధించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కేసులు తగ్గుముఖం పట్టడంతో క్రమంగా సడలింపులు ఇస్తూ వచ్చింది.. అయితే, నైట్ కర్ఫ్యూ మాత్రం కొనసాగుతూనే ఉంది… తాజాగా మరోసారి నైట్ కర్ఫ్యూను పొడిగించింది ఏపీ ప్రభుత్వం… ఈ నెలాఖరు వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పేర్కొంది… అర్థరాత్రి 12 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు కోవిడ్ ఆంక్షల్లో భాగంగా నైట్ కర్ఫ్యూ అమల్లో…
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ గాడి తప్పింది అంటూ ఆంధ్రప్రదేశ్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు సకాలంలో ఇవ్వకపోతే ఎలా..? అని నిలదీసిన ఆయన.. వృద్ధాప్యంలో వారి వైద్య ఖర్చులకీ ఇబ్బందులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని… రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ గాడి తప్పడమే దీనికి కారణంగా తెలిపారు పవన్ కల్యాణ్… మరోవైపు.. పోలీసుశాఖలో…
గత టీడీపీ ప్రభుత్వం, హెరిటేజ్‌పై విమర్శలు గుప్పించారు సీఎం వైఎస్ జగన్.. జగనన్న పాలవెల్లువ, మత్స్యశాఖలపై సమీక్ష నిర్వహించారు సీఎం.. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య రూపొందించిన జగనన్న పాలవెల్లువ మహిళా డెయిరీ సహకార సంఘం– కార్యదర్శికి మార్గదర్శకాలు, జగనన్న పాలవెల్లువ- శిక్షణా కరదీపిక పుస్తకాలను ఆవిష్కరించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో సహకార రంగంలోని డెయిరీలను స్వప్రయోజనాలకు మళ్లించారని.. కొందరు సహకార డెయిరీలను తమ ప్రైవేటు సంస్థలుగా మార్చుకున్నారని ఆరోపించారు.. సహకార…