Amaravati Restart Event Live Updates: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో మహోన్నత ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభోత్సవ కార్యక్రమం మొదలు కానుంది.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కురసాల కన్నబాబు ఆరోపణలు గుప్పించారు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ఆర్ అండ్ ఆర్ అడిగిన రైతులపై కేసులు పెట్టిన చరిత్ర టీడీపీది అని మంత్రి కన్నబాబు విమర్శలు చేశారు. చంద్రబాబు ఎప్పటికీ రైతు బంధు కాలేడని.. ఆయన రైతు రాబంధు అని అభివర్ణించారు. అమరావతిలో రైతుల పేరుతో కొందరు కృత్రిమ ఉద్యమం చేస్తున్నారని టీడీపీని ఉద్దేశించి మంత్రి కన్నబాబు మండిపడ్డారు. తమ ప్రభుత్వం అమరావతితో పాటు అన్ని…
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని నిరసనలు కొనసాగుతున్న వేళ కేంద్రం ఊరట కలిగించే వార్తను అందించింది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర బడ్జెట్ 2022-23లో రాజధాని ప్రొవిజన్ ఇచ్చి మరీ నిధులను కేటాయించింది. ఇందులో అమరావతిలో ఏయే నిర్మాణాల కోసం నిధులు కేటాయిస్తున్నారో అన్న విషయం కూడా ప్రస్తావించింది. దీంతో ఈ నిధులను ఏపీ ప్రభుత్వం అమరావతిలో నిర్మాణాల కోసమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. కేంద్ర…
రాజధాని అమరావతిలో రైతులు ఉద్యమం ప్రారంభించి నేటితో సరిగ్గా 800 రోజులు అవుతోంది. అమరావతినే రాజధానిగా ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అమరావతి కోసం తాము ప్రాణ సమానమైన భూములను ప్రభుత్వానికి అప్పగించామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని పక్కన పెట్టడం.. పైగా మూడు రాజధానుల పేరుతో కొత్త ప్రతిపాదనలు తీసుకురావడంతో అమరావతి రైతులు రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు. తమకు జరిగిన అన్యాయంపై నిరంతర పోరాటం సాగిస్తున్నారు. తమ…
అమరావతి రాజధాని రైతులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్తను అందించింది. రైతులు పెద్దసంఖ్యలో ఒకేసారి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అనుమతి జారీ చేసింది. కరోనా నిబంధనలను పాటిస్తూ బుధవారం ఉదయం 500 మంది రైతులు ఒకేసారి దర్శనం చేసుకోవచ్చని సూచించింది. Read Also: అయ్యప్ప భక్తులకు శుభవార్త… తెలంగాణ నుంచి శబరిమలకు 200 బస్సులు కాగా ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో 44 రోజుల పాటు…
కర్నూలు : అమరావతినే క్యాపిటల్ గా ఉంచాలి.. పేరు ఏదైనా పెట్టుకొండి. కానీ అభివృద్ధి మాత్రం చేయండని టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గందరగోళంలో పరిపాలన చేస్తే రాష్ట్రం సవ్యంగా ఉండదు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఆలూ లేదు సోలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఉందని… అమరావతిని అలాగే ఉంచి కర్నూలులో సమ్మర్ లేదా వింటర్ క్యాపిటల్ చేయాలని రాయలసీమ హక్కుల ఐక్యవేదిక మొదటి నుంచి డిమాండ్ చేస్తోందని టీజీ…
అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు నటుడు శివాజీ సంఘీభావం తెలిపారు. అమరావతి రైతులను కలిసి వారికి తన మద్దతును తెలియజేశారు. ఏపీ అంటేనే కులాల కుంపటి అని… ఈ కులాల కుంపట్ల మధ్య రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని శివాజీ ప్రశ్నించారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ఎవరూ గుర్తించడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజలు సినిమాలో సీన్‌లను బాగానే గుర్తుపెట్టుకుంటారని.. కానీ సమాజంలో జరుగుతున్న వాటిని మాత్రం గుర్తుపెట్టుకోవడం లేదన్నారు. ప్రజలందరూ కలుషితం అయిపోయారని.. ఆ…
అమరావతిలో రాజధానిని నిర్మించేది బీజేపీనేనని… రాజధాని అమరావతిలోనే ఉండాలనేది బీజేపీ చెబుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర పదాధికారులు జిల్లా అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన సోము వీర్రాజు మాట్లాడుతూ… అమరావతి రైతుల పోరాటానికి బీజేపీ మద్ధతిస్తుందన్నారు. ఈ నెల 21న రైతుల పాదయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నామని…తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి అభివృద్ధి విషయంలో వెనకడుగు…
ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని జగన్ సర్కార్ ప్రకటించడంతో అమరావతి అభివృద్ధికి తమ భూములు ఇచ్చిన రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాకుండా సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ రాజధాని రైతులు 45 రోజుల మహా పాదయాత్రను ప్రారంభించారు. నవంబర్ 1న ప్రారంభమైన ఈ పాదయాత్ర నేడు మూడో రోజు కొనసాగుతోంది. ఈ పాదయాత్రలో రాజధాని రైతులతో పాటు మహిళలు పాల్గొన్నారు. అయితే రైతులకు…