Allu Ramalingaiah: ఆకాశంలో హరివిల్లును చూసిన ప్రతీసారి, అది దేవునితో మనిషికి ఉన్న అనుబంధానికి చిహ్నంగా భావిస్తారు కొందరు. తెరపై మహా హాస్యనటుడు అల్లు రామలింగయ్యను చూడగానే తెలుగువారికి అలాంటి అనుబంధమే గుర్తుకు వస్తుంది.
రాజమండ్రి హోమియోపతి మెడికల్ కళాశాలలో అల్లు రామలింగయ్య విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్ల్లాడుతూ.. నటుడిగా తాను జన్మించింది రాజమండ్రిలోనేనని.. తన మొదటి మూడు సినిమాలు రాజమండ్రి ప్రాంతంలో చిత్రీకరణ జరిగాయని వెల్లడించారు. తనది అల్లు రామలింగయ్యగారిది గురు – శిష్యుల సంబంధమన్నారు. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల తనకు కడుపులో మంట వచ్చేదని… ఎన్ని యాంటాసిడ్లు వాడినా కడుపులో మంట తగ్గలేదన్నారు. అల్లు రామలింగయ్యగారు ఒకసారి ఇచ్చిన హోమియో మందుతో నొప్పి…
లెజెండరీ సీనియర్ నటుడు అల్లు రామలింగయ్య విగ్రహాన్ని నిన్న అల్లు బ్రదర్స్ ఆవిష్కరించారు. అల్లు కుటుంబానికి హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన కోకాపేట్ ప్రాంతంలో భూమి ఉంది. అక్కడ గత సంవత్సరం అల్లు స్టూడియోస్ నిర్మాణానికి సన్నాహాలు చేపట్టారు. ఇప్పటికే శంకుస్థాపన కార్యక్రమం పూర్తి కాగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ రోజు అల్లు రామలింగయ్య శత జయంతి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తన సోదరులు బాబీ, శిరీష్‌తో కలిసి వారి తాత, లెజెండరీ నటుడు అల్లు…
(అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య జయంతి) తెలుగునాట వెండితెరపై వేయి చిత్రాలలో వెలిగిన తొలి నటుడుగా అల్లు రామలింగయ్య చరిత్ర సృష్టించారు. సదరు చిత్రాలలో వేళ్ళ మీద లెక్కపెట్ట దగ్గవాటిని పక్కకు నెడితే, అన్నిటా అల్లువారి నవ్వులే విరబూశాయి. జనం మదిలో ఇల్లు కట్టుకొని మరీ గిల్లుతూ అల్లువారు నవ్వుల పంటలు పండించారు. గిల్లిన ప్రతీసారి మళ్ళీ మొలిచే పంటలవి. అజరామరమైనవి. తెలుగు చిత్రసీమలో అల్లు రామలింగయ్య హాస్యం ఏ తీరున ప్రత్యేకమైనదో, అదే విధంగా ఆయన…
మెగాస్టార్ చిరంజీవి రేపు రాజమండ్రి పర్యటనకు వెళ్లనున్నారు. తూర్పు గోదావరి జిల్లా లోని రాజమండ్రికి పయనం కానున్నారు. రాజమండ్రి లోని ఓ వైద్య కళాశాలలోని అల్లు రామ లింగయ్య విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి ఆయన అక్కడికి వెళ్తున్నారు. డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియోపతి వైద్య కళాశాల, ఆసుపత్రి ఆవరణలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సహకారంతో ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించనున్నారు. అయితే ఆంధ్రాలో పవన్, వైసీపీ మధ్య మాటల యుద్ధం…
(సెప్టెంబర్ 24న ‘ప్రేమమందిరం’కు 40 ఏళ్ళు) నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్ లో అనేక చిత్రాలు వెలుగు చూశాయి. వాటిలో అన్నిటికన్నా మిన్నగా నిలచింది ‘ప్రేమాభిషేకం’. ఈ చిత్రం విడుదలైన 1981లోనే అక్కినేని, దాసరి కాంబినేషన్ లో రూపొందిన మరో చిత్రం ‘ప్రేమ మందిరం’. ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత డి.రామానాయుడు నిర్మించడంతో ‘ప్రేమమందిరం’కు మొదటి నుంచీ ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది. అప్పటికే ‘ప్రేమాభిషేకం’ జైత్రయాత్ర కొనసాగుతోంది. అక్కినేని అభిమానుల…