తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చినట్టుగా ఇక మీదట సినిమాలకు బెనిఫిట్ షోస్ కి పర్మిషన్ ఇచ్చేది లేదని తేల్చేసింది. తాజాగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు అసెంబ్లీలో ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు సంధ్య థియేటర్ తొక్కిసలాట అంశం మీద ముందు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఒక సినీ హీరోని అరెస్ట్ చేస్తే అందరూ రాద్ధాంతం చేశారంటూ ఆయన…
సినీ హీరో అల్లు అర్జున్ ను సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు బెయిల్ లభించినా సరే ఒకరోజు రాత్రి జైలులో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు ఉదయం 6:30 గంటల సమయంలో ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యారు.. వెంటనే ఆయన తన నివాసానికి వెళ్లారు. అయితే ఈ కేసు మీద ఇప్పటికే అనేకమంది సినీ ప్రముఖులు స్పందిస్తూ వస్తున్నారు. నేరుగా సంబంధం లేకపోయినా ఇలా ఒక…
సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు అల్లు అర్జున్.. మృతి చెందిన రేవతి కుటుంబానికి సానుభూతి తెలిపిన ఆయన.. ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా పేర్కొన్నారు.. ఆ కుటుంబానికి అండగా ఉంటానని మీడియా ముఖంగా హామీ ఇచ్చారు..
నేను బాగానే ఉన్నాను.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు అల్లు అర్జున్.. అయితే, కేసు కోర్టు పరిధిలో ఉంది.. ఇప్పుడు ఏం మాట్లాడలేను అని స్పష్టం చేశారు.. నేను చట్టాన్ని గౌరవిస్తాను.. నాకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు తెలిపిన బన్నీ.. సంధ్య థియేటర్ ఘటనపై స్పందిస్తూ.. రేవతి కుటుంబానికి నా సానుభూతి.. జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు.. ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా పేర్కొన్నారు.. ఆ కుటుంబానికి అండగా ఉంటానని ప్రకటించారు అల్లు అర్జున్. ఈ…
అల్లు అర్జున్ రాత్రి 10.30 గంటల వరకు చంచల్ గూడ జైలులోని రిసెప్షన్ లోనే ఉన్నారు. కానీ, బెయిల్ పత్రాలు ఆలస్యం రావడంతో ఆయనను మంజీర బ్యారక్ లో ఉంచారు. ఈ సందర్భంగా జైలు అధికారులు అండర్ ట్రైల్ ఖైదీగా 7697 అనే నెంబర్ ను కేటాయించారు.
బెయిల్ ఆర్డర్ కాపీ అందిన తర్వాత జైలు అధికారులు అల్లు అర్జున్ ను విడుదల చేశాయని చెప్పుకొచ్చారు. అయితే, వెంటనే రిలీజ్ చేయాలని మద్యంతర బెయిల్ లో స్పష్టంగా ఉన్నప్పటికి.. కావాలనే పోలీసులు బెయిల్ ప్రోసిడింగ్స్ లేట్ చేశారని అడ్వకేట్ అశోక్ రెడ్డి వెల్లడించారు.
Allu Arjun: హీరో అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలు నుంచి ఈరోజు ఉదయం 6.30 గంటలకు విడుదల అయ్యారు. చంచల్‌గూడ జైలు వెనుక గేట్ నుంచి ఆయన వెళ్లిపోయారు. ఇక, అల్లు అర్జున్ వెంట తండ్రి అల్లు అర్జున్, మామ చంద్రశేఖర్ ఉన్నారు.
తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సల్మాన్ ఖాన్ సంజయ్ దత్ లు ఎందుకు రెస్ట్ అయ్యారు? అని ప్రశ్నించిన ఆయన భారతదేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉంది దానికి అనుగుణంగానే చట్టం పనిచేస్తుందని అంటున్నారు. అల్లు అర్జున్ ను అరెస్టు చేశామంటున్నారు కానీ అక్కడ మహిళ చనిపోయింది, ఆమె కొడుకు ఇంకా జీవన్మరణ సమస్యతో బాధపడుతున్నాడు, ఆ ఘటనపై క్రిమినల్ కేసు బుక్…
CM Revanth Reddy : ఢిల్లీలో ఆజ్ తక్ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ అరెస్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశంలో సల్మాన్ ఖాన్ సంజయ్ దత్ లు ఎందుకు రెస్ట్ అయ్యారని, దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉంది దానికి అనుగుణంగానే చట్టం పనిచేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్ అరెస్టు చేసామంటున్నారు.. అక్కడ మహిళ చనిపోయింది, ఆమె కొడుకు ఇంకా…