Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సల్మాన్ ఖాన్ సంజయ్ దత్ లు ఎందుకు రెస్ట్ అయ్యారు? అని ప్రశ్నించిన ఆయన భారతదేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉంది దానికి అనుగుణంగానే చట్టం పనిచేస్తుందని అంటున్నారు. అల్లు అర్జున్ ను అరెస్టు చేశామంటున్నారు కానీ అక్కడ మహిళ చనిపోయింది, ఆమె కొడుకు ఇంకా జీవన్మరణ సమస్యతో బాధపడుతున్నాడు, ఆ ఘటనపై క్రిమినల్ కేసు బుక్ అయిందని అన్నారు. ఈ ఘటన జరిగిన పది రోజుల తర్వాత పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారని ఆయన అన్నారు. ప్రాణం పోయింది అయినా కేసు పెట్టొద్దా?ఫిలిం స్టార్లు, పొలిటికల్ స్టార్ల కోసం ప్రత్యేకంగా ఏముండదు అని ఆయన అన్నారు. కారులో వచ్చి సినిమా చూసి వెళ్తే ఎటువంటి సమస్య ఉండకపోయేది.. కానీ కారులోంచి బయటికి వచ్చి చేతులూపి హడావిడి చేశారు.
Allu Arjun : బెయిల్ వచ్చినా అల్లు అర్జున్ ఈరోజు జైల్లోనే ఉండాలా?
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
దాంతో జనం పెద్ద ఎత్తున ఎగబడ్డారు కంట్రోల్ కాలేదు, అందుకే అల్లు అర్జున్ ను ఈ కేసులో A11 గా పోలీసులు పెట్టారని అన్నారు. అక్కడ మహిళ ప్రాణం పోయింది, దానికి ఎవరు బాధ్యులు? అని రేవంత్ రెడ్డి అన్నారు. నాకు చిన్నప్పటినుంచి అల్లు అర్జున్ తెలుసు, అతనికి నేను తెలుసు, అల్లు అర్జున్ మామ చిరంజీవి కాంగ్రెస్ నేత, అల్లు అర్జున్ కు పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేత .. నాకు బంధువు అని ఆయన అన్నారు. అల్లు అర్జున్ భార్య మాకు బంధువు అని అన్నారు. హోం శాఖ నా వద్ద ఉంది, ఈ కేసుకు సంబంధించినటువంటి రిపోర్ట్ నాకు తెలుసు అని పేర్కొన్న ఆయన చనిపోయిన మహిళ కొడుకు ఇంకా కోమాలో ఉన్నాడని అన్నారు. సినిమా కోసం పైసలు పెట్టారు పైసలు సంపాదించారు, వాళ్లు ప్రత్యేకంగా దేశం కోసం చేసింది ఏం లేదు అని ఆయన అన్నారు. ఇక తన ఫేవరెట్ హీరో కృష్ణ అని పేర్కొన్న ఆయన ఇప్పుడు లేరు అని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు నేనే స్టార్ను నాకే ఫాన్స్ ఉంటారు, ఉండాలి కూడా అంటూ కామెంట్ చేశారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!